ప్రతీ విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందించాలి
ABN , Publish Date - Jan 24 , 2026 | 11:44 PM
ప్రతీ విద్యా ర్థికి కనీస విద్యా ప్రమాణాలు అందించేలా ఉపాధ్యా యులు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉపాధ్యా యులను ఆదేశించారు. శనివారం మండలంలో విస్తృ తంగా పర్యటించారు.
సుల్తానాబాద్, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ప్రతీ విద్యా ర్థికి కనీస విద్యా ప్రమాణాలు అందించేలా ఉపాధ్యా యులు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉపాధ్యా యులను ఆదేశించారు. శనివారం మండలంలో విస్తృ తంగా పర్యటించారు. పూసాల ఎంపీపీఎస్, పల్లె దవా ఖానా, భూపతిపూర్‌లోని కేజీబీవీ, బీసీ బాలుర గురు కుల పాఠశాల, సుల్తానాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తా, గర్రెపల్లిలోని ఎస్సీ రెసిడెన్షియల్ కళాశాలను పరిశీలిం చారు. భూపతిపూర్‌లోని కేజీబీవీలోని 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి, ప్రతి ఒక్క రికి 90 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిం చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేజీబీవీ ప్రహ రీ, మరమ్మతు పనులు పూర్తి చేయాలన్నారు.
పూసాల ఎంపీపీ ఎస్ పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ పంపిణీ చేశా రు. ఎస్‌ఆర్‌ఎస్ విధానం ద్వారా హాజరు నమోదు చేయాల న్నారు. పాఠశాలలో ఎఫ్‌ఎల్‌ఎన్ అమలుపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తంచేశారు. గర్రెపల్లిలోని ఎస్సీ రెసిడెన్షియల్ కళాశాలలో జరుగుతున్న పర్యావరణ పరీక్షను కలెక్టర్ పరిశీలించారు. పరిసరా లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రాబోయే పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలన్నారు. అం బేద్కర్ చౌరస్తా నుంచి గట్టెపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మా ణ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఇంటర్మీడి యట్ నోడల్ అధికారి కల్పన, తహసీల్దార్ బహీరుద్దీన్, మున్సి పల్ కమిషనర్ రమేష్, ఎంపీఓ సమ్మిరెడ్డి, డీఈ రవి కిరణ్, ఏఈ గుణశేఖర్ రెడ్డి, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ స్వప్న, ఏఈపీఆర్, బీసీ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.