Share News

గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌లే కీలకం

ABN , Publish Date - Jan 23 , 2026 | 11:47 PM

గ్రామాల్లో ఎలాంటి సమస్య ఉన్న వాటిని పరిష్కరించి పాలన అందించేది సర్పంచ్‌ చేతుల్లోనే ఉందని, దానికి ప్రభుత్వం, అధికారులు పూర్తి సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు.

గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌లే కీలకం

పెద్దపల్లి రూరల్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ఎలాంటి సమస్య ఉన్న వాటిని పరిష్కరించి పాలన అందించేది సర్పంచ్‌ చేతుల్లోనే ఉందని, దానికి ప్రభుత్వం, అధికారులు పూర్తి సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. పెద్దబొంకూరు మదర్‌థెరిస్సా ఇంజ నీరింగ్‌ కళాశాలలో సర్పంచ్‌లకు శిక్షణ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్‌ కోయ శ్రీహర్షతోపాటు ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లా డుతూ గ్రామపరిపాలన సజావుగా ఉండేలా సర్పంచ్‌లు నిరంతరం పర్యవేక్షించా లన్నారు. పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, విద్యుత్‌ దీపాలు సరిగా ఉండేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రాజకీయా లకతీతంగా గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలన్నారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, చివరి ప్రాంతాలకు మిషన్‌ భగీరథ నీరు సరిగా అందని పక్షంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వినియోగించుకుంటూ పంచాయతీ అభివృద్ధికి నిధులు ఎలా సమకూర్చుకోవాలనే అంశాలపై శిక్షణ అందిం చినట్లు తెలిపారు. ప్రతి సర్పంచ్‌ ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. అనంతరం శిక్షణ పొందిన సర్పంచ్‌లకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, జడ్పీ సీఈవో నరేందర్‌, ఎంపీడీవోలు, ఎంపీవోలు, కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 11:47 PM