Share News

ప్రతిఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

ABN , Publish Date - Jan 23 , 2026 | 11:49 PM

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధ నలను పాటించి, రోడ్డు ప్రమాదాలకు దూరంగా ఉండాలని పోలీస్‌ కమి షనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. శుక్రవారం ఎన్టీపీసీ పీటీఎస్‌ లోని కాకతీయ ఆడిటోరియంలో నిర్వహించిన అరైవ్‌... అలైవ్‌ కార్యక్రమంలో సీపీ ప్రసంగించారు.

ప్రతిఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

జ్యోతినగర్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధ నలను పాటించి, రోడ్డు ప్రమాదాలకు దూరంగా ఉండాలని పోలీస్‌ కమి షనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. శుక్రవారం ఎన్టీపీసీ పీటీఎస్‌ లోని కాకతీయ ఆడిటోరియంలో నిర్వహించిన అరైవ్‌... అలైవ్‌ కార్యక్రమంలో సీపీ ప్రసంగించారు. పోలీసులు ఎంత అవగాహన చేసినా, ప్రజలు రహ దారి నిబంధనల మేరకు నడుచుకోవాలని తెలిపారు. ద్విచక్ర వాహన దారులు హెల్మెట్‌ ధరించాలన్నారు. మైనర్లకు బైక్‌లు ఇవ్వరాదని, మద్యం సేవించి, మొబైల్‌లో మాట్లాడుతూ వాహనాలు నడిపి ప్రమాదాలకు గురైన పక్షంలో ఎదుటి వారి కుటుంబాలు రోడ్డున పడుతాయని గుర్తుం చుకోవాలన్నారు. ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చందన్‌కుమార్‌ సామంత మాట్లాడుతూ సంస్థలో పని చేసే ప్రతీ ఉద్యోగి ట్రాఫిక్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి లఘు చిత్రాలను ప్రదర్శించారు. అరైవ్‌... అలైవ్‌ వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించి, ట్రాఫిక్‌ రూల్స్‌ను పాటిస్తామని ప్రతిజ్ఞ చేయిం చారు. గోదావరిఖని ఏసీపీ రమేష్‌, ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీనివాస్‌, సీఐలు, ఎస్‌ఐలు ప్రవీణ్‌ కుమార్‌, రాజేశ్వర్‌రావు, అనిల్‌ కుమార్‌, ఉదయ్‌కిరణ్‌, సంధ్యారాణి, వెంకట్‌స్వామి పాల్గొన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 11:49 PM