జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ క్రమబద్ధీకరణ
ABN , Publish Date - Jan 23 , 2026 | 11:46 PM
జిల్లాలో పని చేస్తున్న 165 మంది జూనియర్ పంచాయతీ కార్య దర్శుల సర్వీసును క్రమబద్ధీకరిస్తూ కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పెద్దపల్లి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పని చేస్తున్న 165 మంది జూనియర్ పంచాయతీ కార్య దర్శుల సర్వీసును క్రమబద్ధీకరిస్తూ కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతర్గాం, ధర్మారం మండలలాల్లో 14 మంది, ఎలిగేడు, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో 9 మంది, జూలపల్లి మండ లంలో ఏడుగురు, కమాన్‌పూర్ మండలంలో ఆరుగురు, మంథని, సుల్తానాబాద్ మండలాల్లో 20 మంది, ఓదెల, రామగిరి మండలాల్లో 11 మంది, పాలకుర్తి మండలం లో 12 మంది, పెద్దపల్లి మండలంలో 23 మంది జూని యర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీక రించారు. దీంతో వారికి గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శులుగా నియామక ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు నిశాంత్‌రావు ఆధ్వర్యంలో కార్య దర్శులు కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్యకు పుష్పగుచ్ఛాలు అందించి కృతజ్ఞతలు తెలిపారు.