Home » Karimnagar
రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఎట్టకేలకు టాస్క్‌ఫోర్స్‌ను పునరుద్ధరించారు. కమిషనర్‌గా అంబర్ కిశోర్ ఝా బాధ్యతలు తీసుకున్న తరువాత టాస్క్‌ఫోర్స్‌ను రద్దు చేశారు. టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని నార్కోటిక్ విధులకు వినియోగించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో గతంలో టాస్క్‌ఫోర్స్‌పై అనేక ఆరోపణలు రావడంతో కొత్తగా బాధ్యతలు తీసుకున్న అంబర్ కిశోర్ ఝా ఈ నిర్ణయం తీసుకున్నారు.
జలసిరి కార్యక్రమంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కాళిందిని అధికారులను ఆదేశించారు. రాఘవాపూర్, సబ్బితం గ్రామాల్లో ఆమె పర్యటించారు.
సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఉద్యోగుల పెండింగ్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం జిల్లా కార్యవర్గ సమావేశం ఐఎంఏ హాల్‌లో జరిగింది.
ఎల్‌నినో ప్రభావం తీవ్రం కాబోతుందని, వరి పంటలు సాగు వద్దన్నా కూడా రైతులు మొండిగా వ్యవహరిస్తే సాగునీటి కొరత వల్ల ఆర్థిక నష్టాలు తప్పవని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలో రూ.75 లక్షల వ్యయంతో నిర్మించిన రెవెన్యూ కార్యాలయ భవనాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష కలిసి ప్రారంభించారు.
జగిత్యాల జిల్లాలోని పొరండ్ల గ్రామంలో విషజ్వరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రామంలో విషజ్వరాల బారిన పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది.
సింగరేణిలో ఆదాని, అంబానీల రూపంలో దొంగలు పడ్డారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) గౌరవ అధ్యక్షులు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం గోదావరిఖని జీఎం ఆఫీస్ గ్రౌండ్‌లో జరిగిన సింగరేణి కార్మికుల కవాతులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ సింగరేణి 80 ఏళ్ల చరిత్ర కలిగిన సంఘం ఏఐటీయూసీ అని, దీనిలో కొనసాగడానికి కార్మిక వర్గం గర్వపడాలన్నారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కార్యక్రమంపై అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మున్సిపల్ పాలక వర్గాన్ని సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయా లని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగరపు రజనీకాంత్ అన్నారు. శుక్ర వారం రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ, వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆయన పాల్గొన్నారు.
వర్షం నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను వృథా చేయకుండా తక్షణమే రక్షణ చర్యలను చేపట్టాలని జడ్పీ సీఈవో, ఇన్చార్జి డీపీవో కె.నరేందర్ అన్నారు. మండల పరిషత్ కార్యాల యంలో శుక్రవారం జలశ్రీ పథకం అమలులో భాగంగా అధికారులతో సమావేశం నిర్వహించారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల దరఖాస్తుదారులకు ఏఐ ఆధారిత 360 డిగ్రీ సర్వే అనర్హులకు షాక్ ఇచ్చింది.