Share News

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి

ABN , Publish Date - Jul 24 , 2026 | 11:32 PM

నీట్‌ ప్రశ్నపత్రాల లీకేజీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే రాజీనామా చేయా లని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగరపు రజనీకాంత్‌ అన్నారు. శుక్ర వారం రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్‌ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ, వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆయన పాల్గొన్నారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి

పెద్దపల్లి కల్చరల్‌, జూలై 24(ఆంధ్రజ్యోతి): నీట్‌ ప్రశ్నపత్రాల లీకేజీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే రాజీనామా చేయా లని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగరపు రజనీకాంత్‌ అన్నారు. శుక్ర వారం రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్‌ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ, వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా నీట్‌ విద్యార్థులు, యువకులు కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని నిరసనలు చేస్తుంటే కేంద్ర ప్రభు త్వం కనీసం విద్యార్థులతో చర్చలు లేకుండా దాడులు చేయడాన్ని నిర సిస్తూ బంద్‌కు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులను పట్టించుకోకుండా రాజకీయాల కోసం పాకులాడుతున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు తక్షణమే రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి నీట్‌ విద్యార్థుల భవిష్యత్‌ గురించి పార్లమెంట్‌లో చర్చ పెట్టాలన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, లేని పక్షంలో దేశ వ్యాప్త ఆం దోళనల ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా కార్యదర్శి ప్రశాంత్‌, సహాయ కార్యదర్శి మామిడిపల్లి అరవింద్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గంప నరేష్‌, రాజ్‌కుమార్‌, బాలాజీ, అభిలాష్‌, నవీన్‌, రాజు, అనిల్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2026 | 11:32 PM