సర్‌పై అప్రమత్తంగా వ్యవహరించాలి
ABN , Publish Date - Jul 24 , 2026 | 11:34 PM
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కార్యక్రమంపై అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మున్సిపల్ పాలక వర్గాన్ని సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
పెద్దపల్లిటౌన్, జూలై 24 (ఆంధ్రజ్యోతి) ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కార్యక్రమంపై అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మున్సిపల్ పాలక వర్గాన్ని సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన ప్రతీ ఓటరు, ఓటరు జాబితాలో పేరు ఉండే విధంగా చూసుకోవాలని. బూత్ లెవెల్ ఆఫీసరు ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రతీ ఓటరు పేరు, చిరునామా, కుటుంబ వివరాలు, ఇతర సమాచారాన్ని పరిశీలించి అవసరమైన సమాచారాన్ని అందించాలని సూచనలు చేశారు. పట్టణంలోని ప్రతీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధి వార్డుల ఓటర్లకు అవగాహన కల్పించాలని ఎన్నికలు ఉన్నప్పుడే ఓటర్ల జాబితాను, ఓట్ల లెక్కలను చూడకుండా ముందస్తుగా జాగ్రత్త వహించాలన్నారు. ప్రజల విశ్వాసాన్ని, తీర్పును గెలుచుకోలేని వారు ఓటర్ల జాబితాల్లో గందరగోళం సృష్టించి, ఓట్లను తొలగించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి అర్హుడి ఓటు జాబితాలో ఉండేలా కాంగ్రెస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రజలకు సహాయసహకారాలు అందించాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.