Home » Karimnagar
గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులను అన్ని శాఖల అధికా రులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం కలెక్ట రేట్‌లో పుష్కరాల ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భక్తులకు అవసరమైన మౌలిక వస తుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
అసంఘటిత కార్మికులకు పింఛన్ అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రమ్ యోగి మాన్‌ధన్(పీఎంఎస్‌వై) పథకాన్ని ప్రవేశపెట్టింది.
కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-563)పై వాహనాల ట్రయల్‌రన్ నడుస్తోంది.
కరీంనగర్ జిల్లాలోని రూరల్ పోలీస్ స్టేషన్‌లో పెట్రోల్ వాహనం చోరీ కలకలం రేపుతోంది. గంజాయి మత్తులో ఓ యువకుడు ఏకంగా పోలీసు వాహనాన్ని ఎత్తుకెళ్లాడు. వెంటనే గుర్తించిన పోలీసులు వాహనం కోసం వెతుకులాట మొదలుపెట్టారు.
సైబర్ నేరాల నుంచి ప్రజలను రక్షించడంలో సైబర్ వారియర్స్ పాత్ర కీలకమని, నేరాలు జరిగినప్పుడు వారియర్స్ వెంటనే స్పందించేలా నైపుణ్యాలను పెంచుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. సోమవారం కమిషనరేట్‌లో సైబర్ నేరాలపై సైబర్ వారియర్స్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మె ల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్ కార్యా లయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఆసరా పెన్షన్ల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. అర్హులైన వారినే ఎంపిక చేసేలా నిబంధన పెట్టింది. ఈ మేరకు గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అర్హులైన లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక డిజెగ్నేటెడ్ వెరిఫైడ్ ఆఫీసర్(ధ్రువీకరణ అధికారులు) (డీవీవో)లను నియమించనున్నది.
అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులపై పోలీసులు దురుసుగా వ్యవహరించ డం, దాడి చేయడం దుర్మార్గమని నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మె ల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. సోమవారం పెద్దపల్లి బస్టాండ్ వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించి సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి శంకర్‌గౌడ్ డిమాండ్ చేశారు. హామీల అమలులో జాప్యం చేస్తే అన్ని జిల్లాల ఉద్యమకారు లను ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చ రించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దకల్వలలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పోరుబాట పిలుపు మేరకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో అందోళన కార్యక్రమాలు నిర్వహించారు.