Home » Kalyanadurgam
మండల పరిధిలోని కంబదూరు వద్ద శుక్రవారం ఆటో బోల్తా పడి నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. కంబదూరు ప్రాంతానికి చెందిన బొమ్మలాట సుబ్బారావు అనే వ్యక్తి మృతి చెందిన నేపథ్యంలో అనంతపురం నుంచి రాజు, ఉమాపతి, రాఘవేంద్ర, లక్ష్మీదేవి శుక్రవారం ఆటోలో వస్తున్నారు. కంబదూరు చెరువు కట్ట ప్రాంతానికి చేరుకునే స మయంలో ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది.
మండల కేంద్రంలోని రాధా స్వామి విద్యాలయం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జాతీయ సైన్స దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యా యురాలు సుశీల అధ్యక్షతన ఏర్పాటు చేసిన సైన్స దినోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎంఈవో తిప్పేస్వామి, ఎస్‌ఐ మహేష్ హాజరయ్యారు.
నియోజకవర్గ ప్రజల కల నెరవేర్చేందుకు త్వరలో కళ్యాణదుర్గంలో నిర్వహిం చే నగరవనం పార్కు ప్రా రంభోత్సావానికి రావాలని ఉప ముఖ్యమంత్రి పవన కళ్యాణ్‌ను ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్రబాబు విజ యవాడలో శుక్రవారం ఆ హ్వానించారు. దీనికి ఆయ న సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మండల పరిధిలోని అపిలేపల్లి మండల పరిషత ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం మండల స్థాయి సైన్స మేళా పోటీలలో గెలుపొందిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులు అభినందించారు.
మండల పరిధిలోని ఎనుములదొడ్డి గ్రామంలో మురు గునీరు రహదారిలోకి చేరి నిత్యం మురుగు గుంటగా మారు తోంది. స్థానిక ప్రధాన రహదారి నుంచి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వరకు సీసీ రోడ్డు లేదు.
శాంతిభద్రత పరిరక్షణ కోసం రేయింబవళ్లు కష్టపడుతున్న పోలీసుల నివాసం కోసం మండల కేంద్రంలో నిర్మించిన క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయి. దీంతో విధులు నిర్వహించి వచ్చిన సిబ్బందికి విశ్రాంతి తీసుకోవడానికి సౌకర్యం లేదు. నివాస గృహాల్లోనే కాదు స్టేషన భవనంలోకి పాములు వస్తున్నాయని స్థానిక స్టేషనలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది భయాందోళన చెందు తున్నారు.
ఆనారోగ్యంతో అనంతపురంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరిని మంగళవారం మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్రగౌడ్ పరామర్శించారు. విషయం తెలుసుకున్న జితేంద్రగౌడ్ హాస్పిటల్‌కు వెళ్లి ఉన్నం ఆరోగ్య పరిస్థితి పై ఆయన కుమారుడు మారుతీ చౌదరిని ఆడిగి తెలుసుకున్నారు.
భక్తులు కోరిన కోర్కెలు తీర్చే మండలకేంద్రంలోని గ్రామదేవత కుందుర్పమ్మ ఆలయంలో ఆదివారం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దఎ త్తున భక్తులు నాలుగో గిరి ప్రదక్షిణ చేపట్టారు.
మండ లంలో కేబుల్ దొంగలు పేట్రేగిపోతున్నారు. వ్యవసాయ తోటల్లో వరుసగా కేబుల్, స్టార్టర్ బాక్సులు చోరీలకు పాల్పడుతున్నారు. తోటల్లో బోర్ల వద్ద కేబుల్ వైర్లు కత్తిరించి తీసుకెళుతు న్నారు. అదేవిధంగా స్టార్టర్ బాక్సులు ఎత్తుకెళు తున్నారు.
మండల పరిధిలోని బొచ్చుపల్లిలో శు క్రవారం పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి రథోత్సవా న్ని గ్రామస్థులు వైభవంగా నిర్వహించారు. ఉదయం దేవాలయంలో ప్రత్యేక పూ జలు నిర్వహించి, స్వామి వారి కల్యాణోత్సవం చేపటా ్టరు.