Share News

HIGH WAY: ప్రమాదకరంగా గూబనపల్లి వద్ద హైవే

ABN , Publish Date - Mar 10 , 2026 | 11:44 PM

మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారి 554డీడీ లో గూబనపల్లి వద్ద మమవప్రమా దాలకు నిలయంగా మారిం ది. నిత్యం ఏదో ఒక చోట ప్ర మాదం జరుగుతూనే ఉంది. అయినా రోడ్డుపై అవసరమై న చోట్ల్ల స్పీడ్‌ బ్రేకర్లు, హె చ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.

HIGH WAY: ప్రమాదకరంగా గూబనపల్లి వద్ద హైవే
Scene of collision between car and RTC bus at Gubanapally on March 1 (File)

తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు

కళ్యాణదుర్గం, మార్చి 10(ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారి 554డీడీ లో గూబనపల్లి వద్ద మమవప్రమా దాలకు నిలయంగా మారిం ది. నిత్యం ఏదో ఒక చోట ప్ర మాదం జరుగుతూనే ఉంది. అయినా రోడ్డుపై అవసరమై న చోట్ల్ల స్పీడ్‌ బ్రేకర్లు, హె చ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ఈ గ్రామానికి అత్యంత సమీపంలోనే రాయదుర్గం వైపు రాకపోకలు సాగించే మలుపులు ప్రమాదకరంగా ఉండటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కొందరు రైతులు రోడ్డుపైనే పంట దిగుబడులు ఆరబోసుకోవడం కూడా ప్రమా దాలకు సంకేతంగా కనిపిస్తోంది.


ఇటీవల జరిగిన సంఘటనలు ఇలా...

- మార్చి 1 న జరిగిన ఆర్టీసీ బస్సు, కారు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

- రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొని యువకుడి మృతి చెందాడు. ఈ సంఘటన మరవకముం దే ట్రాక్టర్‌, ద్విచక్రవాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు.

- ఆటో, ద్విచక్రవాహ నం ఢీకొని రైతు...

- ద్విచక్రవాహనాన్ని స్కార్పియో వాహనం ఢీ కొని ఓ యువకుడు అక్కడి కక్కడే దుర్మరణం చెందాడు.

ఇలా రెండు నెలల వ్యవ ధిలోనే చిన్నాపెద్ద ప్రమాదా లు సుమారు 25 నుంచి 30 వరకు చోటు చేసుకున్నాయి. కొందరు మృతి చెందగా, చాలా మంది గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు.

ఆ ప్రాంతాన్ని పరిశీలించాం- హరినాథ్‌, టౌన సీఐ, కళ్యాణదుర్గం

అధికారులందరూ బృందంగా వెళ్లి ప్రమాద ప్రాంతాన్ని పరిశీలిం చాం. ఆర్‌అండ్‌బీ అధికారులు రాధిక, కుళ్లాయిరెడ్డి, డీఎస్పీ రవిబాబు, ఆర్టీవో తదితరులందరూ వచ్చారు. ఎక్కడెక్కడ స్పీడ్‌ బ్రేకర్లు వేయాలి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలనే అంశాలపై చర్చించాం. ఈ ప్రాంతంలో పూర్తిస్థాయిలో ప్రమాదాలను అరికట్టేందుకు కృషి చేస్తాం.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 10 , 2026 | 11:44 PM