SEWAGE: రోడ్డుపై మురుగునీటి ప్రవాహం
ABN , Publish Date - Mar 05 , 2026 | 11:40 PM
మండల పరిధిలోని ఎనుములదొడ్డి గ్రామంలో మురు గునీరు రహదారిలోకి చేరి నిత్యం మురుగు గుంటగా మారు తోంది. స్థానిక ప్రధాన రహదారి నుంచి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వరకు సీసీ రోడ్డు లేదు.
కుందుర్పి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని ఎనుములదొడ్డి గ్రామంలో మురు గునీరు రహదారిలోకి చేరి నిత్యం మురుగు గుంటగా మారు తోంది. స్థానిక ప్రధాన రహదారి నుంచి వీరరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వరకు సీసీ రోడ్డు లేదు. దీంతో స్థానిక ఇళ్లలో నుంచి వచ్చే మురుగునీరు రహ దారిపై పారుతోంది. దీంతో రహదారిపై గుంతల్లో మురుగు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. ఆ దారిన వెళ్లాలంటే వాహనదారులు, వివిధ పనుల నిమిత్తం వెళ్లే ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ప్రధాన రహదారికి సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టి డ్రైనేజీ ఏర్పాటు చేస్తే తప్ప సమస్య పరిష్కారం కాదని ఆ కాలనీ వాసులు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....