POLICE: శిథిలావస్థలో పోలీస్ క్వార్టర్లు
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:25 PM
శాంతిభద్రత పరిరక్షణ కోసం రేయింబవళ్లు కష్టపడుతున్న పోలీసుల నివాసం కోసం మండల కేంద్రంలో నిర్మించిన క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయి. దీంతో విధులు నిర్వహించి వచ్చిన సిబ్బందికి విశ్రాంతి తీసుకోవడానికి సౌకర్యం లేదు. నివాస గృహాల్లోనే కాదు స్టేషన భవనంలోకి పాములు వస్తున్నాయని స్థానిక స్టేషనలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది భయాందోళన చెందు తున్నారు.
- పెచ్చులూడిన పైకప్పు, బీటలు వారిన గోడలు
- ఏపుగా పెరిగిన ముళ్ల కంపలు
- విషపురుగుల సంచారంతో ఆందోళన
బెళుగుప్ప, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : శాంతిభద్రత పరిరక్షణ కోసం రేయింబవళ్లు కష్టపడుతున్న పోలీసుల నివాసం కోసం మండల కేంద్రంలో నిర్మించిన క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయి. దీంతో విధులు నిర్వహించి వచ్చిన సిబ్బందికి విశ్రాంతి తీసుకోవడానికి సౌకర్యం లేదు. నివాస గృహాల్లోనే కాదు స్టేషన భవనంలోకి పాములు వస్తున్నాయని స్థానిక స్టేషనలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది భయాందోళన చెందు తున్నారు. మండలకేంద్రంలో 1994 సంవత్సరంలో పోలీస్ స్టేషనతో పాటు ఇక్కడ విధులు నిర్వహించే సిబ్బంది కోసం క్వార్టర్లు నిర్మించారు. ఈ స్టేషనలో ఒక ఎస్‌ఐ, ఇద్దరు ఏఎస్‌ఐలు, ముగ్గురు హెడ్ కాని స్టే బుళ్లు పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. వీరి నివాసం కోసం ఎస్‌ఐకి ప్రత్యేక భవనంతో పాటు సిబ్బందికి భవనాలు నిర్మించారు. అప్పటి నుంచి మళ్లీ ఎప్పుడూ కనీస మరమ్మతు లు చేపట్టిన దాఖలాలు లేవు. దీంతో ఆ భవనాల గోడలు బీటలు వారాయి.
ప్రస్థుతం శిథిలావస్థలో ఉన్నాయి. అంతేగాకుండా ఆ భవనాల ఆవరణంలో కంపచెట్లు బాగా పెరిగాయి. దీంతో విషపురుగుల సంచారం ఎక్కువైనట్లు స్థానికులు చెబుతున్నారు. సిబ్బంది నివాసం ఉండేందుకు ఇళ్లు సౌకర్యంగా లేవు. అంతే గాకుండా జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించడం, సమస్యను తెలుసుకోవ డం, పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని హామీనివ్వడం పరిపాటిగా మారింది. సిబ్బంది నివాసం ఉండేందుకు సౌకర్యంగా లేవు. దీంతో వారెవరూ అందులో నివాసం ఉండలేకపోతున్నారు. ఆ భవనాల ను పడగొట్టి, కొత్త భవనాలు నిర్మించాలని కొన్నేళ్ల క్రితమే నిర్ణయిం చారు. ఇప్పటి వరకు అమలు కాలేదు. అధికారులు ఈ సమస్య పరిష్క రిం చడానికి ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సి ఉంది. పోలీస్ క్వార్టర్ల విషయమై స్థానిక ఎస్‌ఐ శివను వివరణ కోరగా... ఈ సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా మని తెలిపారు. అధికారులు పరిశీలించారని, ప్రభుత్వానికి నివేదికలు పంపు తారని తెలిపా రు. నిధులు మంజూరు కాగానే సమస్య పరిష్కార మవుతుందని వివరించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....