PRESENTATION: సైన్స మేళా విజేతలకు అభినందనలు
ABN , Publish Date - Mar 05 , 2026 | 11:43 PM
మండల పరిధిలోని అపిలేపల్లి మండల పరిషత ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం మండల స్థాయి సైన్స మేళా పోటీలలో గెలుపొందిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులు అభినందించారు.
కుందుర్పి, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని అపిలేపల్లి మండల పరిషత ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం మండల స్థాయి సైన్స మేళా పోటీలలో గెలుపొందిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులు అభినందించారు. వారం రోజుల క్రితం మండల స్థాయిలో నిర్వహించిన సైన్స మేళా పోటీలలో ద్వితీయ బహుమతి సాధించిన నాలుగో తరగతి విద్యార్థులు అభిరామ్, అర్చనను, వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయ బృందం అభినందించారు. సంద ర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు బొమ్మయ్య మాట్లాడుతూ ఆ విద్యా ర్థులు ఎంపిక చేసుకున్న ప్రాజెక్టు ద్వారా సేంద్రియ వ్యవసాయ విధానా లు, ఉపయోగాల గురించి చక్కగా వివరించారని తెలిపారు. అదేవిధం గా ప్రాజెక్ట్ గైడ్ టీచర్‌గా వ్యవహరించిన రాజును విద్యార్థులు తల్లిదం డ్రులు పూలమాల వేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హనుమంతరాయుడు, కమిటీ ఛైర్మన తిమ్మరాజు, ఉపాధ్యాయులు నాగేశ్వరి, సురేష్ బాబు, రాజు, విద్యార్థులు తల్లిదండ్రులు లక్ష్మి, నరసింహస్వామి, సావిత్రి, మంజునాథ పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....