YCP: నువ్వేమైనా కలెక్టరా?
ABN , Publish Date - Mar 10 , 2026 | 11:54 PM
‘నన్ను కమర్షియల్ ట్యాక్స్ కట్టమని అడిగేందుకు నువ్వెవరు? నువ్వేమైనా జిల్లా కలెక్టరా? లేక జిల్లా స్థాయి అధికారివా’? అంటూ ఓ వైసీపీ నాయకుడు పంచా యతీ కార్యదర్శిపై మంగళవారం చిందులు తొక్కాడు. వ్యాపార సము దాయాలకు హౌస్ ట్యాక్స్ కాకుండా కమర్షియల్ ట్యాక్స్ కట్టాలని పంచా యతీ కార్యదర్శి మహేష్ మంగళవారం నోటీసులు తీసుకుని ఆ వైసీపీ నాయకుడి ఇంటికి వెళ్లాడు.
- పంచాయతీ కార్యదర్శిపై వైసీపీ నాయకుడి చిందులు
విడపనకల్లు, మార్చి 10(ఆంధ్రజ్యోతి): ‘నన్ను కమర్షియల్ ట్యాక్స్ కట్టమని అడిగేందుకు నువ్వెవరు? నువ్వేమైనా జిల్లా కలెక్టరా? లేక జిల్లా స్థాయి అధికారివా’? అంటూ ఓ వైసీపీ నాయకుడు పంచా యతీ కార్యదర్శిపై మంగళవారం చిందులు తొక్కాడు. వ్యాపార సము దాయాలకు హౌస్ ట్యాక్స్ కాకుండా కమర్షియల్ ట్యాక్స్ కట్టాలని పంచా యతీ కార్యదర్శి మహేష్ మంగళవారం నోటీసులు తీసుకుని ఆ వైసీపీ నాయకుడి ఇంటికి వెళ్లాడు. దీంతో ఆ నాయకుడు కార్యదర్శిపై తీవ్ర స్థాయిలో చిందులు తొక్కాడు. ‘ఊర్లోని ప్రతీ వ్యాపార సముదాయానికి వెళ్లి కమర్షియల్ ట్యాక్స్ కట్టించుకుని నా ఇంటి ముందుకు రాపో’ అంటూ దాడి చేసినంత పని చేసినట్లు స్థానికులు తెలిపారు. ఓ వైసీపీ నాయకుడు మండలకేంద్రంలో బస్టాండు సమీపంలో రోడ్డు పక్కన జీ ప్లస్ వనగా వాణిజ్య సముదాయాన్ని నిర్మించాడు.
కింద ఉన్న విశాల మైన గదిని కెనరాబ్యాంకు శాఖకు అద్దెకిచ్చాడు. దీనికి ముందు భాగం లో ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేశారు. ఏటీఎం పక్కనే ఫొటో స్టుడియో, దానిపై ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన కార్యాలయం, దాని పక్కనే పో స్టాఫీసును ఏర్పాటు చేశారు. వీటన్నింటికి వేలాది రూపాయలు బాడు గలు వస్తున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా ఆయన వాణిజ్య సముదా యానికి కమర్షియల్ ట్యాక్స్ కట్టకుండా గృహ సముదాయ పన్ను చెల్లిస్తూ చేతులు దులుపుకుంటున్నాడు. దీన్ని ప్రశ్నించిన పంచాయతీ కార్యదర్శిపై ఆయన చిందులు తొక్కాడు.
బెదిరించాడు - పంచాయతీ కార్యదర్శి మహేష్
వ్యాపార సముదాయం యజమాని అయిన వలిపిరెడ్డి జనార్దనరెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన మాట వాస్తవమే. కానీ అతను నోటీసులు తీసుకోకుండా, నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెదిరించాడు. ఎవరికైనా చెప్పుకో కమర్షియల్ ట్యాక్స్ కట్టేదిలేదని చెప్పాడు. అందుకే నోటీసును జనార్దనరెడ్డి ఇంటిలోకి వేసి వచ్చా. ఇంకా రెండు నోటీసులు జారీ చేస్తాం. అప్పటికి కమర్షియల్ ట్యాక్స్ కట్టకపోతే ఉన్నతాధికారులుకు తెలిపి వారి ద్వారా కోర్టు నుంచి నోటీసులు పంపుతాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....