Share News

YCP: సేవ్‌ ఆర్డీటీనా.. సేవ్‌ వైసీపీనా..?

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:01 AM

ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యు వల్‌ చేయాలని మండల కేంద్రంలోని ఫాదర్‌ ఆలయం ఎదుట మంగళ వారం వైసీపీ కళ్యాణదుర్గం సమన్వ యకర్త తలారి రంగయ్య ఆధ్వ ర్యంలో లక్ష పోస్టుకార్డుల ఉద్యమం ప్రారంభించారు. ఈ కార్యక్ర మాని కి వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, నియోజకవర్గాల సమన్వయ కర్తలు సాకే శైలజానాథ్‌, విశ్వేశ్వరరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన బోయ గిరిజమ్మ, నియోజకవర్గ పరిశీలకులు మహేం దర్‌ రెడ్డి, నాయకులు ఉమామహేశ్వర నాయుడు, తిప్పేస్వామి హాజర య్యారు.

YCP: సేవ్‌ ఆర్డీటీనా.. సేవ్‌ వైసీపీనా..?
A meeting with empty chairs

- వైసీపీ ఫ్లెక్సీలతో నిండిపోయిన ప్రాంగణం

- సభకు జనం కరువు

కుందుర్పి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) : ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యు వల్‌ చేయాలని మండల కేంద్రంలోని ఫాదర్‌ ఆలయం ఎదుట మంగళ వారం వైసీపీ కళ్యాణదుర్గం సమన్వ యకర్త తలారి రంగయ్య ఆధ్వ ర్యంలో లక్ష పోస్టుకార్డుల ఉద్యమం ప్రారంభించారు. ఈ కార్యక్ర మాని కి వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, నియోజకవర్గాల సమన్వయ కర్తలు సాకే శైలజానాథ్‌, విశ్వేశ్వరరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన బోయ గిరిజమ్మ, నియోజకవర్గ పరిశీలకులు మహేం దర్‌ రెడ్డి, నాయకులు ఉమామహేశ్వర నాయుడు, తిప్పేస్వామి హాజర య్యారు. ఆర్డీటీ పరిరక్షణకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కేవలం వైసీపీ నాయకులు, కార్యకర్తలతోనే సరిపెట్టుకునే పరిస్థితి నెలకొంది.


సభలో జిల్లా నాయకులు మాట్లాడే సమయంలో జై జగన నినాదాలు తప్ప, సేవ్‌ ఆర్డీటీ అనే నినాదం వినిపించలేదు. సభ కూటమి ప్రభుత్వంపై విమర్శలకే పరిమితమైంది. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా స్థాయి నాయ కులు మాట్లాడుతూ... ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌ చేయని పక్షంలో పరిపాలన స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ప్రజలు, ప్రజా సంఘా లతో కలిసి కలెక్టర్‌ రేటును నిర్భంధిస్తామని స్పష్టం చేశారు. ఇక్కడి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లక్ష పోస్టుకార్డులను పంపుతు న్నట్లు తెలిపారు. ప్రస్తుతం పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నా యని, ఏప్రిల్‌ రెండో తేదీలోగా ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆశించిన స్థాయిలో జనాలు రాకపోవడంతో ఖాళీ కుర్చీలతో సభ దర్శనమిచ్చింది. ఇదిలాఉంటే స్థానిక జడ్పీటీసీని ఒక ప్రజాప్రతినిధినిగా గుర్తించని సమన్వయ కర్త తలారి రంగయ్య, ఇక ప్రజా సమస్యలను ఎలా గుర్తిస్తారనే విమర్శలు వినిపించాయి. అదేవిధంగా సభావేదికలో ఇతర మండలాల జడ్పీటీసీల ఫొటోలు వేశారే తప్ప స్థానిక జడ్పీటీసీ ఫోటో లేకపోవడంతో ఆ పార్టీ స్థానిక నాయకులు అసహనం వ్యక్తం చేశారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 11 , 2026 | 12:01 AM