Share News

AUTO: ఆటో బోల్తా - నలుగురికి గాయాలు

ABN , Publish Date - Mar 07 , 2026 | 12:31 AM

మండల పరిధిలోని కంబదూరు వద్ద శుక్రవారం ఆటో బోల్తా పడి నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. కంబదూరు ప్రాంతానికి చెందిన బొమ్మలాట సుబ్బారావు అనే వ్యక్తి మృతి చెందిన నేపథ్యంలో అనంతపురం నుంచి రాజు, ఉమాపతి, రాఘవేంద్ర, లక్ష్మీదేవి శుక్రవారం ఆటోలో వస్తున్నారు. కంబదూరు చెరువు కట్ట ప్రాంతానికి చేరుకునే స మయంలో ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది.

AUTO:  ఆటో బోల్తా - నలుగురికి గాయాలు
The auto rammed into the crop fields

కళ్యాణదుర్గం రూరల్‌, మార్చి 6(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని కంబదూరు వద్ద శుక్రవారం ఆటో బోల్తా పడి నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. కంబదూరు ప్రాంతానికి చెందిన బొమ్మలాట సుబ్బారావు అనే వ్యక్తి మృతి చెందిన నేపథ్యంలో అనంతపురం నుంచి రాజు, ఉమాపతి, రాఘవేంద్ర, లక్ష్మీదేవి శుక్రవారం ఆటోలో వస్తున్నారు. కంబదూరు చెరువు కట్ట ప్రాంతానికి చేరుకునే స మయంలో ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది. మూడు పల్టీలు కొట్టి వరిమడిలోకి దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపా రు. దీతో ఆటోలో ఉన్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. అటుగా వెళుతున్న ప్రయాణికులు స్పందించి 108 ఆంబులెన్స ద్వారా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కంబదూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 07 , 2026 | 12:31 AM