Share News

SCIENCE: ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన

ABN , Publish Date - Mar 07 , 2026 | 12:28 AM

మండల కేంద్రంలోని రాధా స్వామి విద్యాలయం ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో జాతీయ సైన్స దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యా యురాలు సుశీల అధ్యక్షతన ఏర్పాటు చేసిన సైన్స దినోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎంఈవో తిప్పేస్వామి, ఎస్‌ఐ మహేష్‌ హాజరయ్యారు.

SCIENCE: ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన
SI inspecting science samples at Radhaswamy Vidyalayam

కుందుర్పి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని రాధా స్వామి విద్యాలయం ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో జాతీయ సైన్స దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యా యురాలు సుశీల అధ్యక్షతన ఏర్పాటు చేసిన సైన్స దినోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎంఈవో తిప్పేస్వామి, ఎస్‌ఐ మహేష్‌ హాజరయ్యారు. పాఠశాల ఉపాధ్యా యుల సహకారంతో విద్యార్థులు తయారు చేసిన 38 సైన్స ఆకృతులను ప్రదర్శనలో ఉంచారు. ఈ కార్యక్రమంలో మహ మ్మద్‌ పాఠశాల కరెస్పాండెంట్‌ రాజు తదతరులు పాల్గొన్నారు.

బెళుగుప్ప: స్థానిక సనరైజర్‌ విద్యానికేతనలో విద్యార్థులు శుక్రవా రం నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనను ఎంఈవోలు గోవిందరాజులు, హరికృష్ణ హాజరై ప్రారంభించారు. శ్రీనివాస విద్యానికేతన కరెస్పాం డెంట్‌ శ్రీనివాసులు, సనరైజర్‌ పాఠశాల కరెస్పాండెంట్‌ మారెన్న, రిటైర్డ్‌ టీచర్‌ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 07 , 2026 | 12:28 AM