Home » Kaleshwaram Project
కాంగ్రెస్ సర్కార్ కుట్రలో భాగంగానే కాళేశ్వరం కమిషన్ నివేదికను ముందుకు తెచ్చిందని.. ఏదో ఒకరకంగా కేసీఆర్‌ను బద్నాం చేయడమే వారి లక్ష్యంగా కనబడుతోందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టకముందే కాంగ్రెస్ లీకులు ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు.
కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే భయం వాళ్లను వెంటాడుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. అందుకే హరీష్ రావు ఏకంగా జ్యుడిషియల్ కమిషన్‌ను తప్పుబట్టే దుర్మార్గానికి ఒడిగట్టారని విమర్శించారు.
కాళేశ్వరానికి అనుమతులు ఇచ్చిందే కేంద్రప్రభుత్వమని మాజీమంత్రి హరీష్‌రావు గుర్తుచేశారు. కాళేశ్వరం పూర్తి రిపోర్ట్ బయటకు వచ్చాక కాంగ్రెస్ సంగతి చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే సీఎం రేవంత్‌రెడ్డి హడావుడి చేస్తున్నారని హరీష్‌రావు విమర్శించారు.
ఊరు మార్చి.. పేరు మార్చి.. అంచనాలు మార్చి.. అవినీతి, అక్రమాల పునాదులతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, ఈ విషయాను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో స్పష్టంగా వివరించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మేడిగడ్డ దగ్గర బ్యారేజీ నిర్మాణం కేవలం కేసీఆర్ మదిలో పుట్టిన ఆలోచన. దాన్ని ఇష్టానుసారం అమలుచేయడం, తానే ఇంజనీర్‌లా వ్యవహరించడం, ప్లానింగ్‌లో, నిర్మాణంలో లోపాలు, అవకతవకలు, నిబంధనల ఉల్లంఘన వల్లే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు విఫలమయ్యాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేస్తేనే అప్పులపై వడ్డీ తగ్గింపు అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు సంబంఽధించి ఘోష్ కమిషన్ సిఫారసుల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని క్యాబినెట్ సమావేశంలో మంత్రులు పట్టుబట్టారు.
అధికార కాంగ్రెస్ పార్టీ అమ్ములపొదిలో ‘కాళేశ్వర’ అస్త్రం చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ జరిపి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక అధికారపక్షానికి సరికొత్త ఆయుధంగా మారింది.