CPI Narayana: కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి
ABN , Publish Date - Aug 05 , 2025 | 04:01 AM
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్
న్యూఢిల్లీ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ, బీజేపీకి బీఆర్‌ఎస్ పట్ల ప్రేమ లేకపోతే, నిష్పాక్షికంగా విచారణ జరిపించి దోషులను శిక్షించాలన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగడం వాస్తవమని, ఇంజనీర్ల వద్దే కోట్లాది రూపాయలు దొరికినప్పుడు, దానిని రూపకల్పన చేసిన వారు ఇంకెంత దోచుకున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు కేసీఆర్ అహంభావమే కారణమని ఆరోపించారు.