Share News

Pankaj Chaudhary: కాళేశ్వరం పూర్తి చేస్తేనే రుణాలపై వడ్డీ తగ్గిస్తాం

ABN , Publish Date - Aug 05 , 2025 | 03:55 AM

కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేస్తేనే అప్పులపై వడ్డీ తగ్గింపు అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశామన్నారు.

Pankaj Chaudhary: కాళేశ్వరం పూర్తి చేస్తేనే రుణాలపై వడ్డీ తగ్గిస్తాం

  • రాష్ట్రాల గ్రేడ్‌లను చూసే వడ్డీ రేట్లు: కేంద్రం

న్యూఢిల్లీ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేస్తేనే అప్పులపై వడ్డీ తగ్గింపు అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. సోమవారం లోక్‌సభలో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్‌ (ఎస్పీవీలు) ద్వారా సేకరించిన అప్పుల రీస్ట్రక్చర్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందాయని తెలిపారు. కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (కేఐపీసీఎల్‌)కు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ), గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ) నిధులు సమకూర్చాయని వివరించారు.


నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు అయిన పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీలు దేశీయ, ఆఫ్‌షోర్‌ మార్కెట్లలోని వివిధ వనరుల నుంచి నిధులు సేకరిస్తాయన్నారు. వాటికి అయ్యే ఖర్చులను బట్టి వడ్డీరేట్లను నిర్ణయిస్తాయని తెలిపారు. అప్పు తీసుకునే వారి గ్రేడింగ్‌పై కూడా వడ్డీరేట్లు ఆధారపడి ఉంటాయన్నారు. అప్పుల చెల్లింపుల్లో మార్పులు చేస్తే కాళేశ్వరం ప్రాజె క్టు ఖాతా స్టాండర్‌ ్డ నుంచి సబ్‌-స్టాండర్‌ ్డకు దిగజారుతుందని తెలిపారు.

Updated Date - Aug 05 , 2025 | 03:55 AM