• Home » Kadiri

Kadiri

AP News: నిన్ను అలా చూడలేక పోతున్నా తల్లీ..

AP News: నిన్ను అలా చూడలేక పోతున్నా తల్లీ..

నల్లమాడ మండలంలోని ఎన్‌.ఎనుములవారిపల్లి గ్రామానికి చెందిన చిల్లా చిన్నగంగప్ప(54) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్న చిల్లా పెద్ద గంగప్ప తెలిపిన మేరకు... ఆరు నెలల కిందట చిన్నగంగప్ప అల్లుడు భాస్కర్‌ మృతిచెందాడు.

MLA: హాస్టల్‌ వద్ద ప్రైవేటు వాహనాలు వద్దు

MLA: హాస్టల్‌ వద్ద ప్రైవేటు వాహనాలు వద్దు

పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాల యం వద్ద ఉన్న బాలికల హాస్టల్‌ సమీపంలో ప్రైవేటు కార్లు, ట్యాక్సీలను నిలుపకుండా ఆర్టీ డిపో ఆవరణంలో అద్దె వాహనాల స్టాండ్‌ ఏర్పాటు చే యాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. ఆయన మంగళవారం స్థానిక మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

JUDGE: అన్ని సమస్యలకు త్వరలో పరిష్కారం

JUDGE: అన్ని సమస్యలకు త్వరలో పరిష్కారం

కోర్టులలో నెలకొన్న సమస్యలు, న్యాయవాదులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ పరిశీలనలో ఉన్నా యని, త్వరలోనే పరిష్కార మార్గం వస్తుందని జిల్లా ప్రధాన న్యాయా ధికారి భీమారావు అన్నారు. న్యాయా ధికారి శనివారం కదిరిలోని కోర్టుల ను పరిశీలించారు. ఈ సందర్భంగా స్ధానిక న్యాయాధికారులు ఎస్‌ జయ లక్ష్మి, పి. లోకనాథం, న్యాయవాదులు తదితరులు ప్రధాన న్యాయాధికారికి స్వాగతం పలికారు.

GARBAGE: రోడ్డు పక్కనే చెత్త డంపింగ్‌

GARBAGE: రోడ్డు పక్కనే చెత్త డంపింగ్‌

మునిసిపాలిటీ పరిధిలోని కుటాగుళ్ళ లో పేరుకుపో యిన చెత్త కంపుకొడుతోంది. గ్రామం నుంచి వచ్చే మొత్తం చెత్తను కుటాగుళ్ళలోని కదిరి- పులివెందుల రహదారిలో పవర్‌ ఆఫీస్‌ వెనక పారబోస్తున్నారు. కుళ్లిన ఈ చెత్త అటువైపుగా వెళితే కంపుకొడుతోం ది. రోడ్డు పక్కనే చెత్తనంతా వేసి డంపింగ్‌ యార్డ్‌గా తయారు చేశారని పలువురు విమర్శిస్తున్నారు.

MLA: అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం

MLA: అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం

నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ తెలిపారు. ని యోజవర్గంలో చేపట్టిన, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై ఆయన బుధ వారం పట్టణంలోని అర్‌ అండ్‌ బీ బంగ్లాలో వివిధ శాఖల అధికారులు, ఇంజనీర్ల తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరిగేషన అధికారులు, ఇంజనీర్ల సమీక్షలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

APD: బ్లాక్‌ ప్లాంటేషన పనుల పరిశీలన

APD: బ్లాక్‌ ప్లాంటేషన పనుల పరిశీలన

మండల పరిధిలోని ఓరువాయి గ్రామ పంచాయతీ కుమ్మరవాండ్లపల్లి ఆంజనేయస్వా మి ఆలయ భూముల్లో బ్లాక్‌ ప్లాంటేషనలో భాగంగా 110 మామి డి, టెంకాయ, అల్లినేరేడు మొక్కలను నాటే కార్యక్రమం నిర్వహిం చారు. ఏపీడీ శకుంతల మంగళవారం కార్యక్రమాన్ని పరిశీలించి, మొక్కలు నాటారు.

SCHOOL: సమయపాలన లేని పాఠశాల

SCHOOL: సమయపాలన లేని పాఠశాల

తన రూటే సెపరేటు అన్నట్లు సాగుతోంది ఆ పాఠశాల పరిస్థితి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలన్నీ ఉద యం గం. 8.30 నుంచి మధ్యాహ్నం గం. 3.30 వరకు కొనసాగుతుం టే, సంగాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట లోపలే మూతపడుతోంది. మండలంలోని సంగాల గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఐదుగురు విద్యార్థులు ఉన్నారు.

OFFICE: సమస్యల పరిష్కారంలో జాప్యం

OFFICE: సమస్యల పరిష్కారంలో జాప్యం

స్థానిక త హసీల్దార్‌ కార్యాలయంలో ప్రజల సమస్యలు కుప్పలు తెప్పలుగా అపరిష్కృతంగా ఉన్నట్లు ఆరోపణలు విన వస్తున్నాయి. ధ్రువీకరణ పత్రాల వంటి చిన్నపాటి సమస్యలను కూడా నెలల తరబడి అధికారులు పరిష్కరించడం లేదని ప్రజలు వాపోతున్నారు.

ICDS: ప్రభుత్వానికి అంగనవాడీల కృతజ్ఞతలు

ICDS: ప్రభుత్వానికి అంగనవాడీల కృతజ్ఞతలు

మినీ అంగనవాడీలను మెయిన అంగనవాడీలుగా మార్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అంగనవాడీ కార్యకర్తల యూనియన నాయకురాలు మాబున్నీసా తెలి పారు. అంగనవాడీ యూనియన లీడర్లు సోమవారం స్థానిక ఆర్‌ అండ్‌ బీ బంగ్లాలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ను కలిసి కృతజ్ఞ తలు తెలిపారు.

SEWAGE: ఈతోడులో పైప్‌లైన లీకేజీలు

SEWAGE: ఈతోడులో పైప్‌లైన లీకేజీలు

మండల పరిధిలోని ఈతోడు గ్రామంలో తాగునీటి పైప్‌లైన మూడు చోట్ల లీకేజీ అయి, ఆ నీరు రోడ్లపై వృథాగా ప్రవహిస్తోంది. చాలా రోజులుగా ఈ పరిస్థితి నెలకొ న్నా గ్రామ పంచాయ తీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అలాగే ఇళ్లలోని మురు గునీటిని రోడ్ల పైకి వదిలేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి