CROP: కంది పంటకు మంచు దెబ్బ
ABN , Publish Date - Dec 14 , 2025 | 11:37 PM
ఖరీఫ్‌లో సాగు చేసిన కందిపంటకు మంచు కురవడంతో కందిపూత దెబ్బతినే అవకాశం ఉం దని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో మండల వ్యాప్తంగా పలువురు రైతులు కందిపంట సాగు చేశారు. అయితే కంది సస్యరక్షణకు ఎన్నో మెళకువలు పాటించి, తెగుళ్ల నివారణకు మందులు పిచికారీ చేశారు.
గాండ్లపెంట, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌లో సాగు చేసిన కందిపంటకు మంచు కురవడంతో కందిపూత దెబ్బతినే అవకాశం ఉం దని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో మండల వ్యాప్తంగా పలువురు రైతులు కందిపంట సాగు చేశారు. అయితే కంది సస్యరక్షణకు ఎన్నో మెళకువలు పాటించి, తెగుళ్ల నివారణకు మందులు పిచికారీ చేశారు. దీంతో కంది పంట బాగా పూత పూసింది. కొంతమేర ఆశాజనకంగా రైతులకు ఊరటనిచ్చింది. అయితే ఇటీవల కురుస్తున్న మంచుతో కందిపూత అంతా రాలిపోయే అవకాశం ఉందని పంట సా గుచేసిన రైతులు వాపోతున్నారు. సస్యరక్షణకు రైతులు చర్యలు తీసు కుంటున్నా ప్రస్తుతం శీతాకాలంలో మంచు ఎక్కువగా కురుస్తుండడంతో కందిపూత రాలిపోతోందని రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....