MLA: శ్రీవారి క్యాలెండర్ల ఆవిష్కరణ
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:00 AM
పట్టణంలో వెలసిన ప్రముఖ పు ణ్యక్షేత్రమైన ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన క్యాలెం డర్లను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ బుధవారం ఆలయంలో ఆవిష్కరించారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రార్థించామ న్నారు.
కదిరి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): పట్టణంలో వెలసిన ప్రముఖ పు ణ్యక్షేత్రమైన ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన క్యాలెం డర్లను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ బుధవారం ఆలయంలో ఆవిష్కరించారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రార్థించామ న్నారు. ఈ నెల 30న ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయంలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని, ప్రజలందరూ సంతోషంగా శ్రీవారిని దర్శించుకునేవిధంగా చర్యలు చేపడతామని తెలిపారు.
అంగనవాడీలకు 5జీ ఫోన్ల పంపిణీ
కదిరి అర్బన: అంగనవాడీ సేవలను మరింత పారదర్శకంగా విస్తృతం చేసేందుకు ప్రభుత్వం 5జీ మొబైల్ ఫోనలను అందుబాటులోకి తెచ్చిందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్ర సాద్ పేర్కొన్నారు. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో బుధవారం అంగన వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లకు ఎమ్మెల్యే చేతుల మీదుగా 5జీ మొబైల్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ... సేవల్లో వేగం, పారదర్శకత కోసం కూటమి ప్రభుత్వం స్మార్ట్ టెక్నాలజీని ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ రాధిక, ఐసీడీఎస్ సిబ్బంది, టీడీపీ నాయకులు బాహుద్దీన పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....