JANASENA: సోషల్ మీడియా పోస్టులపై ఫిర్యాదు
ABN , Publish Date - Dec 14 , 2025 | 11:47 PM
ఉపముఖ్యమంత్రి పవన కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకులు ఆదివారం రూరల్ సీఐ నాగేంద్రకు ఫిర్యాదు అందజేశారు. గాండ్లపెంట మండల పరిధి లోని చామాలగొందికి చెందిన హరినాయుడు సోషల్ మీడియాలో ఉప ముఖ్యమంత్రిపై అసభ్యకర పోస్టులు పెట్టారన్నారు.
కదిరి అర్బన, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ఉపముఖ్యమంత్రి పవన కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకులు ఆదివారం రూరల్ సీఐ నాగేంద్రకు ఫిర్యాదు అందజేశారు. గాండ్లపెంట మండల పరిధి లోని చామాలగొందికి చెందిన హరినాయుడు సోషల్ మీడియాలో ఉప ముఖ్యమంత్రిపై అసభ్యకర పోస్టులు పెట్టారన్నారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ, ప్రజల్లో అపోహలు చేస్తున్న ఇలాంటివారిపై చర్యలు తీసుకోవా లని కోరారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇనచార్జ్ భైరవ ప్రసాద్, కిన్నెర నాగమహేశ్వర్, ఈటీ లోకేశ్వర్, కాయల చలపతి, రాజేం ద్రప్రసాద్, జక్కా రమణ, సాకే రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....