WIRES: ప్రమాదకరంగా విద్యుత తీగలు
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:40 AM
మండలపరిధి లోని పెడబల్లిగ్రామ చెరువు ఆకట్టు కింద రైతులు పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో విద్యుత 11కేవీ వైర్లు చాలా తక్కువ ఎత్తులో వేలాడుతున్నాయి. దీంతో ఆ వైర్లు వెళుతున్న తమ పొలాల్లోకి వ్యవసాయ పనులు చేసేందుకు ట్రాక్టర్లు రావడం లేదని రైతులు వెంకటరమణ, వెంకటయ్య తదితరులు పేర్కొన్నారు.
పొలంలో తక్కువ ఎత్తులో ఉన్న వైనం
నంబులపూలకుంట, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): మండలపరిధి లోని పెడబల్లిగ్రామ చెరువు ఆకట్టు కింద రైతులు పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో విద్యుత 11కేవీ వైర్లు చాలా తక్కువ ఎత్తులో వేలాడుతున్నాయి. దీంతో ఆ వైర్లు వెళుతున్న తమ పొలాల్లోకి వ్యవసాయ పనులు చేసేందుకు ట్రాక్టర్లు రావడం లేదని రైతులు వెంకటరమణ, వెంకటయ్య తదితరులు పేర్కొన్నారు. పక్క పొలాల రైతు లందరూ వరి పంట సాగుచేయడానికి పొలాన్ని దుక్కిలు చేసుకుంటున్నారు. తమ పొల్లాలో విద్యుత వైర్లు కిందికి ఉండడంతో ట్రాక్టర్‌తో పనులు చేసేందుకు ఎవరూరా వడంలే దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పలుమార్లు విద్యుత అధికారులకు విన్నవించినా, పట్టించుకోవడంలేదని వారు వాపోయారు. ఇప్పటికైనా విద్యుత అధికారులు స్పందించి 11కేవీ విద్యుత వైర్లు ఎత్తు పెంచాలని వారు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....