ALUMNI: పూర్వ విద్యార్థుల చొరవ
ABN , Publish Date - Dec 14 , 2025 | 11:41 PM
తాము చదువుకున్న పాఠ శాలలో నీటి సమస్య ఉన్నట్లు తెలుసుకున్న పూర్వ విద్యార్థులు స్పందిం చారు. పాఠశాలలో బోరు వేయించి, నీటి సమస్యను పరిష్కరించారు. మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్ల మున్సిపల్ ఉన్నతపాఠశాలలో చాలా రోజుల నుంచి నీటి సమస్య నెలకొంది. విద్యార్థులు ఇళ్ల నుంచి బాటిళ్లలో నీటిని తెచ్చుకుని దాహార్తి తీర్చుకునేవారు.
పాఠశాలలో నీటి సమస్య పరిష్కారం
కదిరిఅర్బన, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): తాము చదువుకున్న పాఠ శాలలో నీటి సమస్య ఉన్నట్లు తెలుసుకున్న పూర్వ విద్యార్థులు స్పందిం చారు. పాఠశాలలో బోరు వేయించి, నీటి సమస్యను పరిష్కరించారు. మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్ల మున్సిపల్ ఉన్నతపాఠశాలలో చాలా రోజుల నుంచి నీటి సమస్య నెలకొంది. విద్యార్థులు ఇళ్ల నుంచి బాటిళ్లలో నీటిని తెచ్చుకుని దాహార్తి తీర్చుకునేవారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ వారు వంట చేయడానికి నీరు లేక ఇబ్బందులు పడే వారు. విషయం తెలుసుకున్న అదే పాఠశాలలో 1990-91లో పదో తరగతి చదివిన కుటా గుళ్లకు చెందిన పూర్వ విద్యార్థులు చింతా నాగరాజు, గంగయ్య, ఆంజనే యులు, బాలిరెడ్డి, నగేష్ స్పందించారు. తమ సొంత ఖర్చులతో పాఠశా లలో ఆదివారం బోరు వేయించారు. నీరు పుష్కలంగా ఉండడంతో పా ఠశాలలో నీటి సమస్య పరిష్కారమైంది. బోరు వేయించిన పూర్వ వి ద్యార్థులకు పాఠశాల బోధన, బోధనేతర సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....