BRIDGE: ఈ బ్రిడ్జిపై ప్రయాణం ప్రమాదం
ABN , Publish Date - Dec 13 , 2025 | 11:53 PM
మండలపరిధిలోని నల్ల గుట్టపల్లి తండాకు వెళ్లే రహదారి మధ్యలో ఉన్న బ్రిడ్జిపై ప్రయాణం ప్ర మాదకరంగా ఉందని గ్రా మస్థులు అంటు న్నారు. పెడబల్లి నుంచి నల్లగు ట్టపల్లికి వెళ్లే మార్గ మధ్య లో ఆర్డీటీ ఆధ్వర్యంలో పాపాగ్ని నదికి అడ్డంగా ఈ బ్రిడ్జి నిర్మించారు.
నంబులపూలకుంట, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని నల్ల గుట్టపల్లి తండాకు వెళ్లే రహదారి మధ్యలో ఉన్న బ్రిడ్జిపై ప్రయాణం ప్ర మాదకరంగా ఉందని గ్రా మస్థులు అంటు న్నారు. పెడబల్లి నుంచి నల్లగు ట్టపల్లికి వెళ్లే మార్గ మధ్య లో ఆర్డీటీ ఆధ్వర్యంలో పాపాగ్ని నదికి అడ్డంగా ఈ బ్రిడ్జి నిర్మించారు. ఈ బ్రిడ్జిని నిర్మించకముందు ఆయా గ్రామస్థులు చాలా అవస్థలు పడుతూ నదిని దాటుకునేవారు. ఈ బ్రిడ్జి నిర్మించిన తరువాత ప్ర యాణం సులువైంది. అయితే ఈ బ్రిడ్జిని తక్కువ ఎత్తులో నిర్మిం చడంతో, ఈ బ్రిడ్జిపైన నీరు నిరంతరం ప్రవహిస్తోంది. దీంతో బ్రిడ్జి పాచి పట్టింది. ద్విచక్రవాహనాలు, పాదాచారులు రాకపోకలు సాగించేం దుకు ఇబ్బందులు పడుతున్నారు. పాచిపట్టడంతో ఈ బ్రిడ్జిపై ద్విచక్రవాహనాలు జారి పడి, పలువురు దివ్యాంగులైన సంఘటనలు ఉన్నాయి. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడానికి శనివారం ఆ గ్రామానికి వెళ్లిన 407 వాహనం బ్రిడ్జిపై అదుపు తప్పి పక్కకు వాలింది. గ్రామంలో అందరూ వ్యవసాయంపైనే జీవనం సా గిస్తున్నారు. పండించిన పంటలను విక్రయించాలంటే వాహనాలు రావడానికి ఇబ్బందిగా ఉందని గ్రామస్థులు అంటున్నారు. బ్రిడ్జి ఎత్తు పెంచి వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....