MLA: ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తాం
ABN , Publish Date - Dec 13 , 2025 | 11:49 PM
లబ్ధిదారుల సమస్యలను పరిష్కామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. మండల పరిధిలోని చామాలగొంది పంచాయతీ బయ్యా రెడ్డిగారిపల్లిలో శనివారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఆయనతో పాటు ఆర్డీవో వీవీఎస్ శర్మ పాల్గొన్నారు.
ప్రజాదర్బారులో ఎమ్మెల్యే కందికుంట
గాండ్లపెంట, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): లబ్ధిదారుల సమస్యలను పరిష్కామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. మండల పరిధిలోని చామాలగొంది పంచాయతీ బయ్యా రెడ్డిగారిపల్లిలో శనివారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఆయనతో పాటు ఆర్డీవో వీవీఎస్ శర్మ పాల్గొన్నారు. సర్పంచ శివప్పనాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... లబ్ధిదారుల సమస్యలను స్వ యంగా తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేశారన్నారు. నేరుగా గ్రామాలకెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామన్నారు. ఈ ప్రజాదర్బార్‌లో ప్ర జల నుంచి వివిధ సమస్యలపై 30 ఫిర్యాదులు అందినట్లు తహసీల్దార్ బాబురావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామక్రిష్ణ, ఏఓ షాదాబ్, ఎపీఎం సూర్యనారాయణ, వైద్యాధికారి మారుతి మహేశ్వర్, ఏపీఓ చంద్రశేఖర్, వివిధశాఖలాధికారులు, ఎంపీపీ సోముశేఖర్‌రెడ్డి, జనసేన మహిళ నాయకురాలు సత్యవతి, ప్రసాద్, సుధాకర్, అక్రమ్, చంద్ర తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....