OFFICES: ఇరుకు గదుల్లో సచివాలయ సేవలు
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:48 PM
గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో నూతనంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన విషయం విది తమే. అయితే చాలా చోట్ల ప్రభుత్వ భవనాలను పూర్తిచేయడంలో మరి చింది. మండల వ్యాప్తంగా సచివాల యాలు పలు సచివాలయాలు నిర్మా ణ దశలోనే ఉన్నాయి. దీంతో వాటిని ఇరుకైన అద్దెగదుల్లో నిర్వహిస్తుం డడంతో ప్రజలు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. అమడగూరు, కసముద్రం, మహమ్మదాబాద్‌లలో గ్రామ సచివాలయాలకు మంజూరైన భవనాలను పూర్తిగా నిర్మించారు.
అమడగూరు, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో నూతనంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన విషయం విది తమే. అయితే చాలా చోట్ల ప్రభుత్వ భవనాలను పూర్తిచేయడంలో మరి చింది. మండల వ్యాప్తంగా సచివాల యాలు పలు సచివాలయాలు నిర్మా ణ దశలోనే ఉన్నాయి. దీంతో వాటిని ఇరుకైన అద్దెగదుల్లో నిర్వహిస్తుం డడంతో ప్రజలు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. అమడగూరు, కసముద్రం, మహమ్మదాబాద్‌లలో గ్రామ సచివాలయాలకు మంజూరైన భవనాలను పూర్తిగా నిర్మించారు. అవి ప్రారంభమై వాటిలో ఉద్యోగులు సేవలందిస్తున్నారు. అయితే పూలకుంటపల్లి, చినగానిపల్లి, తుమ్మల, చీకిరేవులపల్లి, జౌకలకొత్తపల్లిలో కొన్ని మోల్డింగ్ వరకు నిర్మించగా, కొన్ని గోడలతో అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో గ్రామ సచివాలయాలను పంచాయతీ కార్యాలయాల్లోని చిన్నగదు ల్లో నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా గుండువారిపల్లిలో భవనం పూర్తి అయి ఏడాది గడుస్తు న్నా ప్రారంభానికి నోచుకోలేదు.
జౌకలకొత్తపల్లిలో పాత పంచాయతీ కార్యాలయంలోనే సచివాలయ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. అక్కడ నెట్‌వర్క్ సమస్య ఉండడంతో సచివాలయ సిబ్బంది పక్కనే ఉన్న హాస్టల్ గదులలో ప్రజలకు అరకొరగా సేవలు అందిస్తున్నారు. దీంతో పాటు కసముద్రంలోనూ నెట్‌వర్క్ సమస్య నెలకొంది. అయితే అఽధికారు లు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. అన్ని గ్రామ సచివాల యాలలో గతంలో ఫైబర్ నెట్ సౌకర్యం ఉండేది. దాన్ని తొలగించడంతో సిబ్బంది వారి సెల్‌ఫోనలో ఉన్న ఇంటర్‌నెట్ సాయంతో ప్రజలకు సేవ లు అందిస్తున్నారు. దీంతో సేవలకు అంతరాయాలు కలుగు తున్నాయ ని దీనిపై అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
చివరిబిల్లు అందక ప్రారంభం కాలేదు- మునెప్ప, ఎంపీడీఓ
జౌకలకొత్తపల్లి, పూలకుంటపల్లిలో సచివా లయాలు నిర్మించేందుకు దాతలు స్థలాలను ఇచ్చారు, గోడల వరకు నిర్మించిన తరువాత భాగస్తులు కోర్టుకు పోవడంతో భవనం పను లు అర్ధాంతరంగా ఆగాయి. కొన్ని గ్రామాల్లో భవనాలు పూర్తిఅయినా కాంట్రాక్టర్లకు చివరిబి ల్లు అందకపోవడంతో ప్రభుత్వానికి స్వాధీనం చేయ లేదు. కొన్ని నెట్‌వర్క్ సమస్య నెలకొన్నట్టు ఉన్నతాధికారులకు తెలియజేసి సమస్యను పరిష్కరిస్తాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....