Share News

TAP: మురుగునీటిలో తాగునీటి కొళాయి

ABN , Publish Date - Dec 16 , 2025 | 11:51 PM

మండలపరిధిలోని చంద్ర బాబునాయుడు కాలనీలో అధికారులు తాగునీటి సరఫరా కోసం కొళా యిలు ఏర్పాటుచేశారు. కాలనీలోని రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన కొ ళాయి నీరు ఎటూ వెళ్లడానికి వీలు లేకుండాపోయింది. దీంతో కొళాయి చుట్టూ పెద్ద గుంత ఏర్పడి, నీరు నిలువ ఉంది. ఈ నీటిలో దోమలు విచ్చలవిడిగా వృద్ది చెందుతున్నాయి.

TAP: మురుగునీటిలో తాగునీటి కొళాయి
Standing water around the drinking water tap

పట్టించుకోని అధికారులు - ఇబ్బందుల్లో ప్రజలు

తనకల్లు, డిసెంబరు16 (ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని చంద్ర బాబునాయుడు కాలనీలో అధికారులు తాగునీటి సరఫరా కోసం కొళా యిలు ఏర్పాటుచేశారు. కాలనీలోని రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన కొ ళాయి నీరు ఎటూ వెళ్లడానికి వీలు లేకుండాపోయింది. దీంతో కొళాయి చుట్టూ పెద్ద గుంత ఏర్పడి, నీరు నిలువ ఉంది. ఈ నీటిలో దోమలు విచ్చలవిడిగా వృద్ది చెందుతున్నాయి. కాలనీవాసులుతాగునీరు వచ్చినప్పుడు ఆనిలువ ఉన్ననీటిలోకి దిగి బిందెలను నీటిలోనే ఉంచి నీరు పట్టుకోవాల్సిన దుస్థితి నెలకుంది. తాగునీటి కొళాయి చుట్టూ నిలువ ఉన్న నీరుకూడా పచ్చగా మారి, మురుగునీరులా తయారైంది. ఇందులో దోమలు వృద్ధి చెందుతు న్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


స్థానికులు ప్రతి రోజు అలాంటి మురునీటిలో దిగి తాగునీటిని పట్టుకుంటున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా అధి కారులెవరూ స్పందించిన పాపాన పోలేదని గ్రామస్థులు మండిపడుతు న్నారు. పంచాయతీ అధికారులుగానీ, గ్రామ సచివాలయ ఉద్యోగులు గానీ, వైద్యఆరోగ్య ఉద్యోగులుగానీ పట్టించుకోలేదన్న విమర్శలు వినిపి స్తున్నాయి. తాము గ్రామ పంచాయతీ అధికారులకు, వైద్యాధికారులకు ఫిర్యాదు చేసినా, తమగొడు వినేనాథుడే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే సిమెంటు రోడ్డు ఉండడం, చుట్టూ ఇళ్లు ఉండడం వల్ల కొళాయి వద్ద నుంచి మురుగునీటిని బయటకు పంపడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు గ్రామస్థులు తెలుపుతున్నారు. గ్రామానికి వచ్చే ఎంతోమంది అధికారులకు సమస్యను విన్నవించినా, ఎవరూ స్పం దించలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు తమ సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Dec 16 , 2025 | 11:51 PM