GOD: ఖాద్రీశుడి భక్తుల గిరి ప్రదక్షిణ
ABN , Publish Date - Dec 16 , 2025 | 11:55 PM
ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతిని పురస్కరించుకుని మంగళవారం మం డల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లిలో స్తోత్రాద్రి కొండ చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు.
కదిరి అర్బన, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతిని పురస్కరించుకుని మంగళవారం మం డల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లిలో స్తోత్రాద్రి కొండ చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. స్తోత్రాద్రి కొండపై కొండల లక్ష్మీనరసింహుడిగా, కాటమ రాయుడిగా, చెంచులక్ష్మీ సమేతంగా కొలువైన శ్రీవారిని దర్శిం చుకోవడానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ఖాద్రీ లక్ష్మీనరసింహ సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు తాగునీరు, మజ్జిగ అందించారు.