• Home » Kadiri

Kadiri

WATER: తాగునీటి సౌకర్యం కల్పించాలి

WATER: తాగునీటి సౌకర్యం కల్పించాలి

తాగునీటి సౌకర్యం కల్పించాలంటూ మండలపరిధి లోని దోరణాల గ్రామస్థులు కోరారు. ఈమేరకు మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మండల పరిధిలోని కటారుపల్లి పంచాయతీ దోరణాల గ్రామంలో తాగునీటి బోరు తరచూ మరమ్మతులకు గురు వుతోందని తెలిపారు.

OFFICIALS: కర్బూజ పంటను పరిశీలించిన అధికారులు

OFFICIALS: కర్బూజ పంటను పరిశీలించిన అధికారులు

మండలంలో రైతులు సాగుచేసిన కర్బూజ పంట పొలాలను ఉద్యానశాఖాధికారులు సోమవారం పరిశీలించారు. మండల వ్యాప్తంగా సాగుచేసిన పలువురు రైతులకు కర్బూజ కన్నీరు మిగిల్చింశీ ‘కన్నీళ్లు మిగిల్చిన కర్బూజ’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో సోమవారం కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన ఉద్యానశాఖ అధికారి ప్రతాప్‌రెడ్డి మండలంలో కర్బూజ సాగు చేసిన పొలాలను పరిశీలించారు.

COLLECTOR: చియా సాగుపై అవగాహన కల్పించండి : కలెక్టర్‌

COLLECTOR: చియా సాగుపై అవగాహన కల్పించండి : కలెక్టర్‌

జిల్లాలో చియా సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఎ. శ్యాంసుందర్‌ వ్యవశాయ శాఖ అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం అనంతరం చియా సాగు విఽధానంపై ప్రచార కరపత్రాలను ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌, జిల్లా వ్యవసాయ అధికారి రాము నాయక్‌, ఆర్డీఓ వీవీఎస్‌ శర్మతో కలిసి కలెక్టర్‌ ఆవిష్కరించారు.

PGRS: పీజీఆర్‌ఎస్‌లో సమస్యల వెల్లువ

PGRS: పీజీఆర్‌ఎస్‌లో సమస్యల వెల్లువ

పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు సమస్యల వెల్లు వెత్తాయి. నియోజకవర్గంలోని ఆరు మండలాలతో పాటు అమడ గూరు మండల ప్రజలు తరవచ్చారు. మొత్తం 551 ిఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఎన్పీకుంట మం డలం వంకమద్దికి చెందిన రైతులు తాము తమ భూములను సోలార్‌కు ఇవ్వమని, తమకు జీవానాధారం అవేనని కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు.

CGP: సీజీపీ నుంచి నీటి విడుదల

CGP: సీజీపీ నుంచి నీటి విడుదల

మండల పరిఽధిలోని ముండ్లవారి పల్లి సమీపంలో పాపాగ్ని నదికి అడ్డంగా నిర్మించిన సీజీ ప్రా జెక్ట్‌ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. పది రోజులుగా కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వందమానేరు, పాపాగ్ని నది ప్రవహించ డంతో డ్యాంకు పూర్తి స్థాయిలో నీరుచేరింది. దీంతో మూడు రోజుల నుంచి ప్రతి రోజు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నా రు.

STUDENTS: ఆల్‌రౌండ్‌ చాంపియనగా బాలికల పాఠశాల

STUDENTS: ఆల్‌రౌండ్‌ చాంపియనగా బాలికల పాఠశాల

పట్ణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఎస్‌సీఎఫ్‌ క్రీడల్లో బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఆల్‌ రౌండ్‌ ఛాంపియన షిప్‌ గెలుచుకున్నారు. రెండో స్థానంలో ఏపీ ట్రైబుల్‌ వెల్ఫేర్‌ పాఠ శాల, మూడో స్థానంలో పట్నం పాఠశాల నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు.

ROAD: ఇలా ఉంటే... వెళ్లేదెలా..?

ROAD: ఇలా ఉంటే... వెళ్లేదెలా..?

ఇలా ఉంటే .. గ్రామంలోకి వెళ్లేది ఎలా.. బయటకు వచ్చేది ఎలాగని చిన్నరామన్నగారిపల్లి గ్రామస్థులు ప్ర శ్నిస్తున్నారు. గ్రామంలోకి వెళ్లే కూడలి వద్ద వర్షపునీరు నిలిచి దోమలకు నిలయంగా మారింది. కూడలి మొత్తం బురదమయమై గ్రామంలోకి వెళ్లడానికి వీలుకాని పరిస్థితి ఏర్పడింది. నీరు నిలువ ఉండటంతో దోమలు పెరిగి రోగాలబారిన పడే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన చెం దుతున్నారు.

MLA:  కార్మికులకు న్యాయం చేస్తాం

MLA: కార్మికులకు న్యాయం చేస్తాం

అర్హులైన భవన నిర్మాణ కార్మి కులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ హామీ ఇచ్చారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాల యానికి ఎదురుగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల కాలనీని గురువారం ఆయన పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులలో అర్హులైన వారంద రికీ న్యాయం చేస్తామని తెలిపారు.

CROP: నత్తల  దండు

CROP: నత్తల దండు

నత్త అంటే ఎక్కడో ఒకటో, రెండో కనిపిస్తుంటాయి. అలాంటి నత్తలు లక్షలాదిగా దండుగా ఏర్పడి, పంటలను నాశనం చేస్తున్నాయి. రైతులు లక్షలు పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పంటలను మొక్క దశలోనే దెబ్బతీస్తున్నాయి. మండలంలోని మహమ్మదాబాద్‌ పంచాయతీ పరిధి గొల్లపల్లి ప్రాంతంలో లక్షలాది నత్తలు పంటల్లో సంచరిస్తున్నాయి.

DAM: నిండుకుండలా సీజీ ప్రాజెక్ట్‌

DAM: నిండుకుండలా సీజీ ప్రాజెక్ట్‌

మండల పరిధిలోని ముండ్లవారిపల్లి సమీపంలో పాపాగ్నినదికి అడ్డంగా నిర్మించిన చెన్నరాయస్వామి గుడి ప్రాజెక్ట్‌ నిండుకుం డా దర్శనమిస్తోంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థా యి నీటి మట్టం 27 అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 26.12 అడుగులకు నీరు చేరింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి