MLA: సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
ABN , Publish Date - Dec 22 , 2025 | 11:59 PM
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరై చెక్కులను సోమవారం ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బి బంగ్లాలో పంపిణీ చేశారు. నియోజక వర్గంలోని 22మందికి మంజూరైన రూ. 12,28,362 లక్షల చెక్కులను అందజేశారు.
కదిరి, డిసెంబరు22 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరై చెక్కులను సోమవారం ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బి బంగ్లాలో పంపిణీ చేశారు. నియోజక వర్గంలోని 22మందికి మంజూరైన రూ. 12,28,362 లక్షల చెక్కులను అందజేశారు. కూటమి ప్రభుత్వం నిరుపేదలను సీఎం సహాయనిధి ద్వారా ఆర్థికంగా ఆదుకుంటోందిని ఆయన తెలిపారు. ఈ కార్యక్ర మంలో టీడీపీ నాయకులు పలువురు పాల్గొన్నారు.
అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం
కదిరి: పట్టణంలోని ఖాద్రీ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యం లో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని సోమవారం ఘ నంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌తో పాటు విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన చైర్మన నారాయణ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే... దివ్యాంగులకు రూ. మూడువేల పిం ఛనను రూ. ఆరు వేలు చేసిందన్నారు. విభిన్న ప్రతిభావంతులకోసం ప్రత్యేక రిజర్వేషన తెచ్చామన్నారు. ఆర్టీసి బస్సుల్లో ఉచిత బస్సు ప్ర యాణం కల్పించామన్నారు. అనంతరం దివ్యాంగుల హుక్కల పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన దిల్షాదున్నీషా, మున్సిపల్ కమిషనర్ కిరణ్‌కుమార్, టీడీపీ నాయకులు బాహుద్దీన, కౌ న్సిలర్ ఇస్మాయిల్, బండారు మురళీ, రమణ, రవి, హరినాథరెడ్డి రాజ శేఖర్‌బాబు, టీఎనఎస్‌ఎఫ్ నాయకులు రామాంజి తదితరులు ఉన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....