AMBITION: నీరుగారుతున్న ప్రభుత్వ ఆశయం
ABN , Publish Date - Dec 21 , 2025 | 11:38 PM
గ్రామాల్లో పరసరాల పరిశుభ్రత కోసం పంచాయతీలలో స్వచ్ఛ భారత కార్యక్రమా న్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. ప్రతి పంచాయతీలోని గ్రా మాలలో వీఽధుల పరిశుభ్రత కోసం ప్రభుత్వం స్వచ్ఛతా రాయబారులను నియమించింది.
సొంత పనులకు చెత్త తరలింపు ట్రాక్టర్లు
పట్టించుకోని అధికారులు
గాండ్లపెంట, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పరసరాల పరిశుభ్రత కోసం పంచాయతీలలో స్వచ్ఛ భారత కార్యక్రమా న్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. ప్రతి పంచాయతీలోని గ్రా మాలలో వీఽధుల పరిశుభ్రత కోసం ప్రభుత్వం స్వచ్ఛతా రాయబారులను నియమించింది. వాళ్లు ప్రతి రోజూ ఇంటింటి వద్దకు వెళ్లి చెత్తను సేకరించి, సంపద తయారీ కేంద్రాలకు తరలించేందుకు ప్రభుత్వం ట్రై సైకిళ్లు, ట్రాక్టర్లను ఆయా పంచాయతీలకు అందజేసింది. అయితే పలు పంచాయతీల అధికారులు వాటిని ఉపయోగించకపోవడంతో అవి కాస్త మూలన పడుతున్నాయి. అధికారులే స్వఛ్చభారత కార్యక్రమాన్ని నీరుగారుస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి.
ట్రాక్టర్ ట్రాలీలు వచ్చినా వినియోగం లేదు
గాండ్లపెంట మండలంలో 14 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి పంచా యతీకి స్వచ్ఛతా రాయబారులు, సంపద తయారీ కేంద్రాలు, చెత్తతర లింపు వాహనాలు ఉన్నాయి. గాండ్ల పెంట, కటారుపల్లి, మలమీదపల్లి మేజర్ పంచాయతీలు కావడంతో చెత్త తరలింపు కోసం రెండేళ్ల క్రితం ట్రాక్టర్‌లు కూడా పంపిణీ చేశారు. అయితే గాండ్లపెంట, కటారుపల్లి పంచాయతీలకు చెందిన ట్రాక్టర్‌లను సర్పంచలు ఇళ్ల వద్గే ఉంచుకున్నా రు. మలమీదపల్లి సర్పంచ ఏకంగా సొంత పనులకు ఉపయోగించు కుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పంఛాయతీ అవస రాల కోసం రూ. లక్షలు ఖర్చు చేసి ట్రాక్టర్‌లు అందజేసింది. అయితే అప్పట్లో నిరూపయోగంగా ఉంచిన ఈ ట్రాక్టర్ల గురించి ఎవరైనా ప్రశ్ని స్తే ట్రాలీలు లేకపోవడంతో వినియోగించలేదని అఽధికారులు సమా ఽధానం ఇచ్చేవారు.
కొద్దిరోజుల క్రితం ప్రభుత్వం ట్రాక్టర్ ట్రాలీలను పంపిణీచేసింది. అయితే గాండ్లపెంట లో ఒక్కరోజు మాత్రమే వినియో గించారు. మరుసటి రోజు నుంచి ట్రాలీని పంచాయతీ కార్యాలయంలో, ట్రాక్టర్‌ను సర్పంచ ఇంటి వద్ద ఉంచా రు. అలాగే కటారుపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ట్రాలీని వదిలే శారు. మలమీదపల్లి పంచాయతీలో సర్పంచ ట్రాక్టర్‌ను ఇంటి వద్ద ఉం చుకోవడంతో సచివాలయం వద్ద ట్రాలీ నిరూపయోగంగా ఉండిపోయింది. ఇప్పుడు ట్రాక్టర్ ట్రాలీలు అందుబాటులో ఉన్నా పంచాయతీల్లో అభివృద్ధి పనులకు వినియోగంలో లేకుండా పోతున్నా యని ఆ పంచాయతీల ప్రజలు వాపోతున్నారు.
చెత్త తరలింపు భారంగా మారింది
మండలంలోని పలు పంచాయతీలలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు ఊర్లకు దూరంగా ఉండటంతో, చెత్త తరలింపు భారంగా మారుతోందని స్వచ్ఛతా రాయబారులు తెలుపుతున్నారు. గ్రామాల్లో చెత్త సేకరణ, తరలింపు కోసం ప్రభుత్వం అందజేషిన ట్రై సైకిళ్లు మరమ్మతులకు గురయ్యాయి. అయితే తప్పని పరిస్థితుల్లో వాటిని వినియోగిస్తు న్నారు.
ప్రస్తుతం మేజర్ పంచాయతీల్లో ట్రాక్టర్ ట్రాలీలు అందుబాటులో ఉన్నాయని, వాటిని అందుబాటులోకి తెస్తే చెత్తను సంపద కేంద్రాలకు తరలించేందుకు సులభంగా ఉంటుందని స్వచ్ఛతా రాయబారులు తెలుపుతున్నారు.
వినియోగంలోకి తీసుకొస్తాం-రామకృష్ణ, ఎంపీడీఓ
మండలకేంద్రమైన గాండ్లపెంట, మండలపరిధిలోని కటారుపల్లి, మలమీదపల్లిలో చెత్త తరలించేందుకు ట్రాక్లర్ ట్రాలీలు ఉన్నాయి. వాటిని పంచాయతీలకు సంబంఽఽధించిన పనుల కు ఉపయోగించాలి. ఆయా సర్పంచులు, పంచాయతీల అధికారులతో మాట్లాడి, వాటిని వినియోగంలోకి తీసుకొస్తాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....