MEETING: సనాతన ధర్మం విశ్వ వ్యాప్తం
ABN , Publish Date - Dec 20 , 2025 | 11:59 PM
ఆది, అంతం లేని సనాతన ధర్మం ప్రపంచమంతటా వ్యాపించి ఉంటుందని ఆర్‌ఎస్ ఎస్ కార్యకర్తలు పేర్కొన్నారు. మండలపరిధిలోని ఆనందాశ్రమం వద్ద శనివారం హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. చేయి చేయి కలిపి అందరు సమైక్యంగా హిందూ ధర్మ స్థాపనకు కృషి చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.
నంబులపూలకుంట, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఆది, అంతం లేని సనాతన ధర్మం ప్రపంచమంతటా వ్యాపించి ఉంటుందని ఆర్‌ఎస్ ఎస్ కార్యకర్తలు పేర్కొన్నారు. మండలపరిధిలోని ఆనందాశ్రమం వద్ద శనివారం హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. చేయి చేయి కలిపి అందరు సమైక్యంగా హిందూ ధర్మ స్థాపనకు కృషి చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. సమాజానికి కుల వ్యవస్థ రాచపుండు లాం టిదని, దాన్ని నయం చేసుకోవాలన్నారు. ఆర్‌ఎస్‌స్ కార్యకర్తలు జగదీష్ ప్రసాద్, వీర ప్రసాద్, ప్రచారక్ గురువిరెడ్డి, రవిచారి, రామగంగిరెడ్డి, మల్లారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హిందూ సమ్మేళానికి తరలిరండి
ధర్మవరం, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ధర్మవరం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల క్రీడామైదానంలో ఆదివారం సాయంత్రం నిర్వహిం చే హిందూసమ్మేళానికి తరలిరావాలని బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్ హరీశబాబు ఇంటింటా వెళ్లి ఆహ్వానించారు.
పట్టణంలోని 2,3,4,5 వారు ్డలలో శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ నాయకులు చిన్నలింగమయ్య, వెంకటేశ, సోమ్లానాయక్ తదితరులు పాల్గొన్నారు. అ లాగే పట్టణంలో నిర్వహించే హిందూసమ్మేళన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు తరలిరావాలని యోగా అసోసియేషన జిల్లా అధ్యక్షుడు గాజుల సోమేశ్వరరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నల్లచెరువులో 24న...
నల్లచెరువు: మండలపరిధిలోని గీతా మందిరంలో ఈనెల 24న నిర్వహించే హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పాల పా టిదిన్నె ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన భాస్కర్‌రెడ్డి శనివారం పిలుపునిచ్చారు. మండలకేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....