HNSS: చెరువులకు చేరుతున్న కృష్ణా నీరు
ABN , Publish Date - Dec 20 , 2025 | 11:29 PM
హంద్రీనీవా నీటి తో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని పాలకులు ఇచ్చిన మాట ను నిలపెట్టుకున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి చెర్లోపల్లి రిజర్వా యర్‌కు, అక్కడి నుంచి చిత్తూరు వరకు నీటి సరఫరాకు వెళ్లే ప్రధాన కాలువ నుంచి కదిరి నియోజకవర్గంలో చెరువులకు నీరు నింపేందుకు చిన్న కాలువలు తీశారు.
పెరుగుతున్న భూగర్భ జలమట్టం - రైతుల్లో ఆనందం
నంబులపూలకుంట, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): హంద్రీనీవా నీటి తో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని పాలకులు ఇచ్చిన మాట ను నిలపెట్టుకున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి చెర్లోపల్లి రిజర్వా యర్‌కు, అక్కడి నుంచి చిత్తూరు వరకు నీటి సరఫరాకు వెళ్లే ప్రధాన కాలువ నుంచి కదిరి నియోజకవర్గంలో చెరువులకు నీరు నింపేందుకు చిన్న కాలువలు తీశారు. మెయిన కెనాల్ నుంచి పట్నం సమీపంలోని క్రాస్ రెగ్యులర్ పాయింట్ నుంచి ప్రారంభమై 14, 15, 16 ,17, 18 ప్యాకెజీల్లో తలుపుల, ఎన్పీకుంట మండలాల్లో ఈ కాలువల పనులు జరిగాయి. కాలువలు తవ్వి సంవత్సరాలు గడిచాయి. వాటి ద్వారా చెరు వులకు నీరు వస్తుందని కొన్నేళ్లుగా ఆయా మండలాల్లోని గ్రామాల రై తులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. హంద్రీనీవా కాలువ పనుల్లో భా గంగా తలుపుల, ఎన్పీకుంట మండలాల్లో టన్నెల్ పనులు యేళ్ల తర బడి జరిగాయి. కూటమి ప్రభత్వం ఏర్పడిన తరువాత ఎట్టకేలకు ఇటీ వల ఈ రెండు మండలాల్లోని చెరువులకు నీరు చేరుతోంది.
తలుపుల, ఎన్పీకుంట మండలాల్లో 14, 17 ప్యాకేజీలు, ఆలాగే ఎన్పీకుంట మం డలంలో 18వ ప్యాకేజీల కింద కాలువల పనులు జరిగాయి. ప్రధాన కా లువ ద్వారా కృష్ణా నీరు ఎన్పీకుంట మండలం దాటుకుని అన్నయ్య జి ల్లాలోని వెలిగల్లు రిజర్వాయర్ చేరుకుని, అక్కడి నుంచి లిప్టు ఇరిగేషన ద్వారా చిత్తూరు చేరుతుంది. ఇటీవల పుట్టపర్తి నియోజకవర్గం లోని వల్లెంవారి ఒడ్డుచెరువు, పెద్దచెరువు, తలుపుల మండలంలోని కొండారెడ్డిచెరువు, కొత్తచెరువువారికుంట, పులిగిండ్లపల్లి చెరువులను నీటితో నింపారు. అదే వరుసలో పులివెందల నియోజకవర్గంలోని ఎర్రబల్లిచెరువును, ఎన్పీకుంట మండలంలోని రేకులచెరువును నీటితో నింపారు. గౌకనపేటచెరువు, వంకమద్ది చెరువులకు నీరు సరఫరా చేస్తున్నారు. వచ్చే జనవరి నెల నాటికి ఈ రెండు చెరువులను నింపి, ఎన్పీకుంట మండల కేంద్రానికి సమీపంలోని రెడ్డిచెరువును నింపనున్నట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం ఇక్కడ నుంచి నీరు అన్నమయ్యజిల్లాకు వెళుతుందని అధికారులు చెబుతున్నారు.
ఆనందంలో రైతులు
మండలంలోని వంకమద్ది చెరువు నిండతుండడంతో రైతులు ఆనం దం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు ఆయకట్టు కింద ఎన్పీకుంట, వంకమద్ది, మరకొమ్మెదిన్నె పంచాయతీలకు చెందిన రైతులకు నాలుగు వందల ఎకరాలకుపై భూములున్నాయి. ఈ చెరువు ఒకసారి నిండితే రెండు సార్లు వరిని సాగుచేస్తారు. ఈ చెరువు కింద వరి సాగు అయితే మండలంలో ధాన్యానికి కరువు లేదనే సామెత ఉంది. ఈ చెరువు నిండుతుండడంతో మండలంలో మూడు నాలుగు పంచాయతీల్లో భూగ ర్భ జలం పెరుగుతుందని రైతులు అంటున్నారు. అలాగే రేకులచెరువు నిండితో పడమరనడింపల్లి, వెలిచెలమల గ్రామాల బోర్లు, బావుల్లో నీరు సమృద్ధిగా ఉంటుందని, గౌకనపేట పెద్దచెరువు ఒకసారి నిండితె బోరు బావుల కింద పంటలు సాగుచేయవచ్చని అంటున్నారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఎన్నికల సమపంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు హంద్రీనీవా అధికారులతో చర్చలు జరిపి,
రైతుల ను సమన్వయ పరిచి తనవంతుగా కృషిచేశారు. దీంతో ఈ ప్రాంతా న్ని పాడిపంటలతో సస్యశ్యామలంగా మార్చానే ఎమ్మెల్యే కోరిక నేరవేరనుందని పలువురు అంటున్నారు.
ఒక చెరువు నిండినతరువాత మరో చెరువుకు నీరు
- వనజ, రెడ్డెప్పరెడ్డి, హెచఎస్‌ఎస్‌ఎస్ డీఈలు
తలుపుల, ఎన్పీకుంట మండలాల్లోని 14 నుంచి 18 ప్యాకేజీ వరకు హంద్రీనీవా కాలువను అనుకుని ఉన్న ఒక చెరువు నిండిన తరువాత మరో చెరువును నీటితో నింపుతున్నాం. మండలంలో ఇంకా చెరువులుంటే రైతులతో చర్చించి, నింపడానికి ప్రయత్నిస్తాం. ప్రస్తుతం గౌకనపేట, వంకమద్ది చెరువులకు నీరు ప్రవహిస్తోంది.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....