MLA: ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:04 AM
ప్రతి కార్యకర్తకు అండ గా ఉంటాననీ, కార్యకర్తలే తన కుటుంబ సభ్యులని ఎమ్మెల్యే కంది కుంట వెం కటప్రసాద్ పేర్కొన్నారు. పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన హాల్‌లో బుధవారం నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రజాస్వామ్యం, కేసుల గురించి మాట్లాడే అర్హత వైసిపి నేతలకు లేదన్నారు.
టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే కందికుంట
కదిరి/ అర్బన, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): ప్రతి కార్యకర్తకు అండ గా ఉంటాననీ, కార్యకర్తలే తన కుటుంబ సభ్యులని ఎమ్మెల్యే కంది కుంట వెం కటప్రసాద్ పేర్కొన్నారు. పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన హాల్‌లో బుధవారం నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రజాస్వామ్యం, కేసుల గురించి మాట్లాడే అర్హత వైసిపి నేతలకు లేదన్నారు. తన మీద కేసు ఉందని పదేళ్లుగా పదే పదే మాట్లాడిన వ్యక్తులకు సమాధానం ఇస్తున్నాన న్నారు. వారి నాయకుడు జగనమోహనరెడ్డికి, ఆ పార్టీ ఇతర నాయకు లకు దమ్ము ధైర్యముంటే కోర్టులో తనపై పిటీషన వేయాలన్నారు. తన మీద ఉన్న కేసుకు పరిష్కారం చూపాలని ఎన్నికల మునుపు కోర్టు లో తానే అడిగానని గుర్తు చేశారు. కోర్టు తీర్పు అనంతరం ఎన్నికల్లో నిలబడి గెలిచానన్నారు.
కేసులు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత వైసీపీ వారికి లేవన్నారు. కేసులు చూసి భయపడే వ్యక్తిని కాద ని, మీలా భయపడి పారిపోలేదని, ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరు కునే ప్రసక్తేలేదని హెచ్చరించారు. సొంత చెల్లికి న్యాయం చేయని వ్యక్తి వైఎస్ జగన అన్నారు. వైఎస్ సునీతమ్మ పోరాటం తమకు స్ఫూర్తి అ ని, పూర్తిస్థాయిలో ఆమెకు మద్దతు ఇస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
పట్టణ, మండల కన్వీనర్ల ఎంపిక
టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో బుధవారం పట్టణ, మండల నూతన కన్వీనర్లను ఎంపిక చేశారు. పట్టణ అధ్యక్షు డిగా డైమండ్ ఇర్ఫాన, రూరల్ కన్వీనర్‌గా రేకే హరికృష్ణ, గాండ్లపెంటకు గొడ్డు వెలగల ప్రసాద్, నంబుల పూలకుంటకు శ్రీరాములు, తలుపులకు మేడా శంకర, నల్లచెరువుకు రాజశేఖర్, తనకల్లుకు తొట్లపల్లి రెడ్డి శేఖర్ రెడ్డిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ నూతన కన్వీనర్లు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. కార్యకర్తలకు ఎదురయ్యే సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. నిబద్ధత కలిగిన నాయకులను మండల కన్వీనర్లుగా నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....