Share News

MLA: పోలియో ర హిత సమాజం స్థాపిద్దాం

ABN , Publish Date - Dec 21 , 2025 | 11:43 PM

పోలియో రహహిత సమాజం స్థాపిద్దామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. ఆయన ఆదివారం పట్టణంలోని గొల్లమ్మ మండపం ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు పల్స్‌ పోలియో చుక్కలు వేశారు.

MLA: పోలియో ర హిత సమాజం స్థాపిద్దాం
MLA administering polio drops to a child

ఎమ్మెల్యే కందికుంట

కదిరి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): పోలియో రహహిత సమాజం స్థాపిద్దామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. ఆయన ఆదివారం పట్టణంలోని గొల్లమ్మ మండపం ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు పల్స్‌ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డల నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నా రులందరికి పల్స్‌ చుక్కలు వేయించాలన్నారు. వారి జీవితంలో పోలియో రాకుండా తల్లిదండ్రులు చూడాలని సూచించారు.ఆయనతోపాటు మున్సిపల్‌ ఛైర్మన దిల్షాదున్షీ ఉన్నారు.

ధర్మవరం: నిండి జీవితానికి రెండు పోలియో చుక్కలు అవసర మని ఆర్డీఓ మహేశ అన్నారు. పట్టణంలో ఆదివారం ప్రభుత్వాస్పత్రి, ఆర్టీసీ బస్టాండ్‌, రైల్వేస్టేషన, పీఆర్‌టీ తదితర మొత్తం 259 పోలింగ్‌ కేంద్రాలలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పల్స్‌పోలియో కేంద్రాన్ని ఆర్డీఓ పరిశీలిం చారు. బీజేపీ నేత హరీశబాబు అక్కడి కేంద్రంలో చిన్నారులకు పోలి యోచుక్కలు వేశారు. పలు వార్డులలో టీడీపీ ఆయా వార్డుల ఇనచార్జ్‌లు పోలియో చుక్కలు వేశారు. అలాగే ధర్మవరంరూరల్‌ మండలంలోని చిగిచెర్ల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంలో జడ్పీ మాజీ చైర్మన చిగిచెర్ల ఓబిరెడ్డి పాల్గొని, చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కొత్తచెరువు, బత్త లపల్లి, అమడగూరు, గాండ్లపెంట, నల్లమాడ, నల్లచెరువు, తనకల్లు తదితర మండలాల వ్యాప్తంగా పల్స్‌ పోలియోను నిర్వహించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Dec 21 , 2025 | 11:43 PM