MLA: పరిశుభ్రతను పాటించాలి : ఎమ్మెల్యే
ABN , Publish Date - Dec 20 , 2025 | 11:38 PM
విద్యార్థులందరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. పట్టణంలోని బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన ముస్తాబ్ కార్యక్ర మానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయన్నారు.
కదిరి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులందరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. పట్టణంలోని బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన ముస్తాబ్ కార్యక్ర మానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయన్నారు. అనారోగ్యం పాలుకాకుండా ఉంటార న్నారు. మంత్రి నారా లోకేశ చేపట్టిన ఈకార్యక్రమాన్ని విజయవం తం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మురళీక్రిష్ణ, మున్సిపల్ కమిషనర్ కిరణ్‌కుమార్, ఎంపీడీఓ పొలప్ప, ఎంఇఓలు చెన్నక్రిష్ణ, ఓబులరెడ్డి తదితరులున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....