Share News

STUDENT: జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

ABN , Publish Date - Dec 18 , 2025 | 12:24 AM

జాతీయ స్థాయి డ్యాన్స స్పోర్ట్స్‌ పో టీలకు తమ పాఠశాల వి ద్యార్థి అసద్‌ అహ్మద్‌ ఖాన ఎంపికైనట్లు స్థానిక బ్లూమూన విద్యాసంస్థల చైర్మన శివశంకర్‌ తెలిపా రు. ఆంధ్రప్రదేశ డ్యాన్స స్పోర్ట్స్‌ అసోసియేషన ఆధ్వర్యంలో ఈ నెల 14న అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో జరిగిన ఏపీ స్టేట్‌ డ్యాన్సస్పోర్ట్స్‌ చాంపియనషిప్‌ పోటీలలో అహ్మద్‌ పాల్గొని ఉమ్మడి జిల్లా తరఫున మొదటి స్థానంలో నిలిచాడన్నారు.

STUDENT: జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు
School staff with meritorious students, SI

కదిరి అర్బన, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయి డ్యాన్స స్పోర్ట్స్‌ పో టీలకు తమ పాఠశాల వి ద్యార్థి అసద్‌ అహ్మద్‌ ఖాన ఎంపికైనట్లు స్థానిక బ్లూమూన విద్యాసంస్థల చైర్మన శివశంకర్‌ తెలిపా రు. ఆంధ్రప్రదేశ డ్యాన్స స్పోర్ట్స్‌ అసోసియేషన ఆధ్వర్యంలో ఈ నెల 14న అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో జరిగిన ఏపీ స్టేట్‌ డ్యాన్సస్పోర్ట్స్‌ చాంపియనషిప్‌ పోటీలలో అహ్మద్‌ పాల్గొని ఉమ్మడి జిల్లా తరఫున మొదటి స్థానంలో నిలిచాడన్నారు. రాష్ట్రస్ధాయి గ్రూపులో స్థానం సాధించాడన్నారు. త్వరలో పంజాబ్‌లో జరిగే జాతీ య స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. బుధవారం పాఠశాలలో జరిగిన సమావే శంలో విద్యార్థిని అఽభినందించారు.


ఈ కార్యక్రమంలో ప్రధానో పాధ్యాయుడు సురేంద్ర రెడ్డి, పాఽఠశాల ఇనచార్జ్‌ మాధవరెడ్డి, పీఈటీ రామాంజులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓబుళదేవరచెరువు : ఎస్‌జీఎఫ్‌ఐ ఫె న్సింగ్‌, రాష్ట్ర డాన్స స్పోర్ట్స్‌ చాంపియన షిప్‌ పోటీలలో స్థానిక శ్రీ జ్ఞాన సాయి స్కూల్‌ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్టు ఆ పాఠ శాల కరస్పాండెంట్‌ క్రిష్ణ మోహనరెడ్డి బుధవారం తెలిపారు. ఆ పాఠ శాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న షరణి గుంటూరులో ఈ నెల 12, 13, 14వ తేదీలలో జరిగిన 69వ ఏపీ ఎస్‌జీఎఫ్‌ఐ ఫెన్సింగ్‌ పోటీల్లో తృతీయ స్థానం సాధించి బ్రాంజ్‌ మెడల్‌ కైవసం చేసుకుందని తెలిపా రు. అలాగే అనంతపురంలో ఆర్డీటీ స్టేడియంలో ఈ నెల 14న జరిగిన 5వ ఏపీ స్టేట్‌ డ్యాన్స స్పోర్ట్స్‌ చాంపియన షిప్‌ - 2025 పోటీల్లో సబ్‌ జూనియర్స్‌ డ్యూయెట్‌ విభాగంలో నాలుగో తరగతి చదువుతున్న నిషి, నిఽధి స్టేట్‌ ఫస్ట్‌ సాఽధించి గోల్డ్‌ మెడల్‌ సాధించారని కరస్పాండెంట్‌ క్రిష్ణ మోహనరెడ్డి తెలిపారు. విద్యార్థుల అభినందన సభలో ముఖ్య అతిథిగా ఎస్సై మల్లికార్జునరెడ్డి పాల్గొని విద్యార్థులను అభినందించారు. అనంత రం స్కూల్‌ విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు గంగాధర్‌, డ్యాన్స మాస్టర్‌ విజయ్‌,ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Dec 18 , 2025 | 12:24 AM