Share News

LIGHTS : ఏడాదికి పైగా వెలగని వీధి దీపాలు

ABN , Publish Date - Dec 23 , 2025 | 11:31 PM

మండలకేంద్రమైన తనకల్లు, అలాగే కొక్కంటి క్రాస్‌లో జాతీయ రహదారి విస్తరణ కార్యక్రమాన్ని ఎని మిదేళ్ల క్రితం చేపట్టారు. అప్పట్లో కొక్కంటి క్రాస్‌, తనకల్లులో డివైడర్లను నిర్మించి, వాటి మధ్యలో విద్యుత స్తంభాలను ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన ఆ స్తంభాలకు లైట్లను కూడా అమర్చారు.

LIGHTS : ఏడాదికి పైగా వెలగని వీధి దీపాలు
Street lights not lit in Tanakallu

అంధకారంలో తనకల్లు, కొక్కంటి క్రాస్‌

రాత్రి వేళ ఇబ్బందులు పడుతున్న ప్రజలు

విన్నవించినా పట్టించుకోని అధికారులు

తనకల్లు, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రమైన తనకల్లు, అలాగే కొక్కంటి క్రాస్‌లో జాతీయ రహదారి విస్తరణ కార్యక్రమాన్ని ఎని మిదేళ్ల క్రితం చేపట్టారు. అప్పట్లో కొక్కంటి క్రాస్‌, తనకల్లులో డివైడర్లను నిర్మించి, వాటి మధ్యలో విద్యుత స్తంభాలను ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన ఆ స్తంభాలకు లైట్లను కూడా అమర్చారు. అయితే ఆ లైట్లు పనిచేయక దాదాపు ఏడాదికిపైగా అవుతోంది. వీధి దీ పా లు వెలుగకపోవడంతో రోజూ రాత్రివేళ అంధ కారంలో గడుపుతున్న తమ గోడు పట్టించుకోవాలని కొక్కంటిక్రాస్‌, తనకల్లు ప్రజలు అటు జా తీయ రహదారి అధికారులకు, ఇటు పంచాయతీ, సచివాలయ అధికారు లకు, ఎంపీడీఓ అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నారు.


అయితే ఎవ రూ స్పందించడం లేదని వాపోతున్నారు. రాత్రిళ్లు బస్సు దిగిన ప్రయా ణికులు వీధి దీపాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మహి ళా ప్రయాణికులు రాత్రి సమయంలో ఇక్కడికి రావడానికి భయపడు తున్నారు. ఎన్నిమార్లు అధికారులకు విన్నవించినా, పట్టించుకోకపోవడం పట్ల తనకల్లు, కొక్కంటి క్రాస్‌ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, తనకల్లు, కొక్కంటి క్రాస్‌లో వీధి దీపాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

జాతీయ రహదారుల అధికారులదే బాధ్యత

- క్రిష్ణమూర్తిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి, తనకల్లు

తనకల్లు, కొక్కంటిక్రాస్‌లో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా డివైడర్లు నిర్మించి, వీధి లైట్లు ఏర్పాటు చేశారు. ఆ లైట్ల నిర్వహణ బాధ్యత జాతీయ రహదారి అధికారులదే. మేము రోడ్డుకు ఇరువైపు ల ఉన్న విద్యుత స్తంభాలకు వీధి లైట్లు ఏర్పాటు చేశాం. డివైడర్లలో ఉన్న వీధి లైట్ల నిర్వాహణ బాధ్యత మాదికాదు. మాకు ఎలాంటి అప్పగిం తలు చేయలేదు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Dec 23 , 2025 | 11:31 PM