MEETING: ‘ఐక్యత కోసమే హిందూ సమ్మేళనం’
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:05 AM
సమాజంలో హిందువుల ఐక్యత కోసమే హిందూ సమ్మేళనం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శ్రీకైలసనాథ ఆశ్రమ మాతాజీ భవ్యానందమాతాజీ సోమవారం పేర్కొ న్నారు. మండలపరిధిలోని మునగలవారిపల్లిలో వెలసిన లక్ష్మీ చెన్నకేశ వస్వామి ఆలయంలో సోమవారం హిందూ సమ్మేళనం నిర్వహించారు.
గాండ్లపెంట, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): సమాజంలో హిందువుల ఐక్యత కోసమే హిందూ సమ్మేళనం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శ్రీకైలసనాథ ఆశ్రమ మాతాజీ భవ్యానందమాతాజీ సోమవారం పేర్కొ న్నారు. మండలపరిధిలోని మునగలవారిపల్లిలో వెలసిన లక్ష్మీ చెన్నకేశ వస్వామి ఆలయంలో సోమవారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మాలను, వాటి ప్రాముఖ్యాన్ని వివరించారు. ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా వ్యవస్థ ప్రముఖ్ సర్వేచరణ్, కిషోర్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఎస్‌ఎస్‌ఎఫ్ డీఎల్ నరసింహరావు, హనుమంతరెడ్డి, మధుసూదన రెడ్డి, హిందూ సమ్మేళన నిర్వాహక అధ్యక్షులు నాగభూషణరెడ్డి, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.