Home » Kadiri
భూములపై సంపూర్ణ హక్కుదారులుగా రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలతో కూటమి ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించిందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని కదిరికుంట్లపల్లిలో శనివారం రెవెన్యూ శాఖ ఆఽధ్వర్యంలో చేపట్టిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. మండలకేంద్రంలో చౌడేశ్వరీ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మండలకేంద్రంలో నిర్మించిన కలెక్షన సెంటర్, కోల్డు స్టోరేజీని ఆయన శనివారం ప్రారంభించారు.
మండలపరిధిలోని గూటి బైలు గ్రామంలో వెలసిన తిమ్మమ్మ మర్రిమాను గు రువారం ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా యాత్రికులతో కిటకిట లాడింది. అమ్మవారిని సిం హవాహనంపై ప్రత్యేకంగా అలంకరించారు. యాత్రి కులు తిమ్మమ్మను దర్శిం చుకుని, మర్రిమాను వద్ద కుటుంబ సభ్యులతో సేద దీరారు.
పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనర సింహ స్వామి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. ఆం గ్ల నూతన సంవత్సరం కావడంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారి దర్శనంకోసం బారులుతీరారు.
మున్సిపాలిటీ పరిధిలోని కొత్త బైపాస్‌రోడ్డు సమీపంలో రెండు రోజుల పాటు జరిగిన ఇజితిమా ఆది వారంతో ముగిసింది. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ముస్లింలు వే లాదిగా తరలి వచ్చారు. వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన మత పెద్దలు ఖురాన సారాంశాన్ని వివరించారు.
స్థానిక విద్యుత శాఖ సబ్ స్టేషనలోని ఏఈ కార్యాలయం భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఐకప్పు పెచ్చులు ఊడి పడుతున్నాయి. గత్యంతరం లేక ఉద్యోగులు భయం భయంగానే విధులు నిర్వహిస్తున్నారు. ఏఈ కార్యా లయంతో పాటు ఆపరేటర్ గది కూడా పెచ్చులు ఊడి కడ్డీలు కనిపిస్తు న్నాయి.
ప్రజా ప్రయోజనాల దృ ష్ట్యా, ప్రజల కోరిక మేరకు నంబులపూలకుంట తది తర సమీప పంచాయతీ లో సీఎస్‌ఆర్ నిధులతో పలు అభివృద్ధి కార్యక్ర మాలు చేపట్టారు. సీఎస్‌ఆర్ నిధులు రూ. కోటితో మండలకేంద్రంలో నూతన ఆలయాల నిర్మాణం చేపట్టారు. మండకేంద్రమైన ఎన్పీ కుంట, పి. కొత్తపల్లి రెవెన్యూ గ్రా మాల్లో సోలార్ అల్ర్టా పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు.
ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కృష్ణా జలాలు శనివారం మం డలకేంద్రానికి చేరాయి. దీంతో రై తులు ఎంతో ఆనందంగా ఉన్నా రు. మండలపరిధిలోని వంకమద్ది చెరువు నిండి మరవ ప్రవహిం చడంతో, మండల కేంద్రానికి నీరు మళ్లించారు. మండల కేం ద్రానికి అనుకుని హంద్రీనీకాలువ లో వెళ్తున్న కృష్ణాజలాలను చూ డడానికి ప్రజలు తరలి వెళ్తున్నా రు.
గాండ్లపెంట మంలలానికి త్వరలో కృష్ణా జలాలు వస్తాయని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. ఆయన శని వారం స్థానిక ఆర్‌అండ్‌బి బంగ్లాలో విలేక రులతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని గాండ్లపెంట మండలానికి హంద్రీనీవా జలాలు తెచ్చేందుకు ప్రభుత్వం జేఓ జారీ చేసిందని, ఎస్‌ఈ శనివారం పర్యటించారని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తోంది. అలాగే విద్యార్థులు క్రీ డల్లోనూ రాణించాలని అన్నిరకాల ఆటలకు సంబంధించి క్రీడా సామగ్రి అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకోసం రోజూ ఒక గంట సమయం కేటాయిస్తారు.