MEETING: భక్తి భావంతో దేశ సమైక్యతకు పాటు పడదాం
ABN , Publish Date - Dec 24 , 2025 | 11:53 PM
భక్తి భావంతో దేశ సమై క్యత కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలని శృంగేరి విరూపాక్ష మఠం పీఠానికి చెందిన విద్యానృసింహభారతి పేర్కొన్నారు. మతమార్పిడి, మ త విద్వేషాలను నిరోధించాలని పిలుపునిచ్చారు. మండలకేంద్రం లోని గీతా మందిరంలో బుధవారం ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో హిందూ సమ్మే ళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
హిందూ సమ్మేళనంలో శృంగేరి విరూపాక్ష మఠం స్వామీజీ విద్యానృసింహభారతి
నల్లచెరువు, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): భక్తి భావంతో దేశ సమై క్యత కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలని శృంగేరి విరూపాక్ష మఠం పీఠానికి చెందిన విద్యానృసింహభారతి పేర్కొన్నారు. మతమార్పిడి, మ త విద్వేషాలను నిరోధించాలని పిలుపునిచ్చారు. మండలకేంద్రం లోని గీతా మందిరంలో బుధవారం ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో హిందూ సమ్మే ళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యానృసింహభారతి స్వామీజీ పాల్గొన్నారు. మండలకేంద్రం లోని సాయిబాబా గుడినుంచి బస్టాండ్, బసవన్నకట్ట, గీతామందిరం మీదుగా సమ్మేళనానికి మద్దుతుగా యువకులు భారీ బైక్‌ర్యాలీ నిర్వ హించారు. అనంతరం సమావేశంలో నృసింహభారతి స్వామీజీ మాట్లా డుతూ... హిందూ సమాజాన్ని చైతన్యపరచి, హైందవ ధర్మ పరిరక్షణకు ప్రతి హిందువు కృషి చేయాలన్నారు. దేవాలయాలు, గోమాతలు హిం దువుల ఆస్తులన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ రాజ శేఖర్‌బాబు, తెలుగు యువత అధ్యక్షుడు గుత్తా ప్రసాద్, నాయకులు భాస్కర్‌రెడ్డి, సతీష్‌రాయల్, ఆంజనేయులు, తలుపుల నరేష్, డ్రిప్ చలపతి, శంకర్, నాస్ నరసింహులు, సురేష్, వర్ల భరత, అయ్యప్ప స్వామి భక్తులు, ఆర్‌ఎస్‌ఎస్ వాదులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.