• Home » Kadiri

Kadiri

MPTC: గౌరవ వేతనం ఇస్తారా..?

MPTC: గౌరవ వేతనం ఇస్తారా..?

ఎంపీటీసీలకు చెల్లించాల్సిన గౌరవ వేతనం మూడున్నరేళ్లుగా చెల్లించలేదని, తమ పదవీకాలం పూ ర్తి అయ్యేలోగా చెల్లిస్తారా? అని కోటపల్లి ఎంపీటీసీ సభ్యురాలు వెంకట సుబ్బమ్మ అధికారులను ప్రశ్నించారు. మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ఎంపీపీ వైవీ కౌసల్య అధ్యక్షతన అధికారులు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

VEMANA: వేమన జయంతికి ముమ్మర ఏర్పాట్లు

VEMANA: వేమన జయంతికి ముమ్మర ఏర్పాట్లు

యోగా వేమన జయంతి ఉత్సవాల సందర్భంగా మండలపరిధిలోని కటారుపల్లి ఆలయ ప్రాంగ ణంలో పలు అభివృధ్ది పనులను ముమ్మరంగా చేపట్టారు. కటారుప ల్లిలో ప్రజాకవి విశ్వవేమన జయంతిని అధికారికంగా జరపాలని నిర్ణయించడంతో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ROAD: ఇంకెన్నాళ్లు...రోడ్డు కష్టాలు?

ROAD: ఇంకెన్నాళ్లు...రోడ్డు కష్టాలు?

ఎగుడు దిగుడు, గుంతల రోడ్లతో ప్రయాణం భా రమవుతోంది. పాలకులు మారినా తమ బాధలు తప్పలేదని వెంకటాపురం పంచాయతీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. మండలపరిధిలో కదిరి - హిందూపురం ప్రధాన రహదారి... వెంక టాపురం పంచాయ తీ లోని నారప్పగారిపల్లి నుంచి వెంకటాపురం మీదుగా కరకమాను తోపు వరకు పూర్తిగా దెబ్బ తింది.

TRAFFIC: వాహనదారులకు ట్రాఫిక్‌ సమస్య

TRAFFIC: వాహనదారులకు ట్రాఫిక్‌ సమస్య

మండల కేంద్రంలోని కదిరి - రాయచోటి ప్రధాన రహదారిలో ద్విచక్రవాహనాలు, ఆటోలను ఎక్కడప డితే అక్కడ నిలుపుతున్నారు. దీంతో ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతు న్నాయని ఆ రోడ్డుపై వెళ్లే వాహనదారులు తెలుపుతున్నారు. కదిరి - రాయచోటి ప్రధాన రహదారి నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది.

MLA: వేమన జయంతి ఉత్సవ ఏర్పాట్లు

MLA: వేమన జయంతి ఉత్సవ ఏర్పాట్లు

మండలపరిధిలోని కటారు పల్లిలో ఈ నెల 19న నిర్వహించే యోగివేమన జయంతి ఉత్సవాల ఏ ర్పాట్లను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ బుధవారం పరిశీలించారు. ఎమ్మెల్యే కందికుంట అభ్యర్థనకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం యోగి వేమన జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు అనుమ తి ఇచ్చింది.

RTO: రోడ్డు భద్రత.. అందరి బాధ్యత : ఆర్టీవో

RTO: రోడ్డు భద్రత.. అందరి బాధ్యత : ఆర్టీవో

రోడ్డు భద్రత అందరి బాధ్యత అని ఆర్టీవో శ్రీనివాసులు పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా మంగళవారం స్థానిక కుటాగుల్ల వద్ద ఓబులేశ్వర డిఫెన్స అకాడమీలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

GOD: ఖాద్రీశుడి భక్తుల గిరి ప్రదక్షిణ

GOD: ఖాద్రీశుడి భక్తుల గిరి ప్రదక్షిణ

ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతిని పురష్కరించుకుని సోమవారం మండల పరిధిలోని కుమ్మవాండ్ల పల్లిలో స్తోత్రాద్రి కొండ చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు.

MLA: వడ్డెర్లందరూ ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలి

MLA: వడ్డెర్లందరూ ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలి

పట్టణంలో వడ్డె ఓబన్న జయం తి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ వడ్డె ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళి అ ర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సమాజంలో అన్నివర్గాల ప్రజలకు మంచిచేయాలనే ధోరణిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు.

MLA:  వేమన జయంతిని సమష్టిగా నిర్వహిద్దాం : ఎమ్మెల్యే

MLA: వేమన జయంతిని సమష్టిగా నిర్వహిద్దాం : ఎమ్మెల్యే

మండలపరిధిలోని కటారు పల్లిలో ఈ నెల 19న యోగివేమన జయంతి ఉత్సవాలను అధికారు లు, గ్రామ పెద్దలు కలిసి ఘనంగా నిర్వహిద్దామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ సూచించారు. కటారుపల్లిలో చేపట్టిన యోగి వేమన జయంతి ఉత్సవాల ఏర్పాట్లను ఎమ్మెల్యే ఆదివారం పరిశీలించారు.

PIPE LINE: పైపులైన లీకేజీలు ... ప్రజలకు ఇబ్బందులు

PIPE LINE: పైపులైన లీకేజీలు ... ప్రజలకు ఇబ్బందులు

పట్టణంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి పైపులు లీకవుతున్నాయి. వాటి వల్ల కొన్నిచోట్ల నీరు కలుషిత మవుతోంది. మరికొన్ని చోట్ల లీకేజీ అయిన నీరు పారి రోడ్లు పా చిపట్టి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లీకుల్లో ఏర్పడిన గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రధాన రోడ్లలో సైతం తాగునీటి పైపులు లీక్‌ అవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి