Share News

REAL: జోరుగా రియల్‌ ఎస్టేట్‌ దందా

ABN , Publish Date - Jan 10 , 2026 | 11:09 PM

రియల్టర్లకు కాసులు వర్షం కురుస్తుందంటే వాగులను కూడా మూసి వేస్తారు. ప్రజల ఎటువంటి సమస్యల పట్టించుకోరనే విమర్శలు మండల ప్రజల నుంచి వినవస్తు న్నాయి. ప్రభుత్వ అనుమతులు ఏ మాత్రం లేకుండా లేఅవు ట్లు వే యడం, ప్రజల నుంచి డబ్బులు దండుకోవ డమే పరిపాటిగా మారుతోంది. దీంతో ప్లాట్లు కొన్నవారు భవిష్య త్తులో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.

REAL: జోరుగా రియల్‌ ఎస్టేట్‌ దందా
A view of the brook being filled up and a road laid across it

అనుమతులు లేకున్నా ప్లాట్ల విక్రయాలు

పట్టించుకోని అధికారులు

గాండ్లపెంట, జనవరి 10(ఆంధ్రజ్యోతి): రియల్టర్లకు కాసులు వర్షం కురుస్తుందంటే వాగులను కూడా మూసి వేస్తారు. ప్రజల ఎటువంటి సమస్యల పట్టించుకోరనే విమర్శలు మండల ప్రజల నుంచి వినవస్తు న్నాయి. ప్రభుత్వ అనుమతులు ఏ మాత్రం లేకుండా లేఅవు ట్లు వే యడం, ప్రజల నుంచి డబ్బులు దండుకోవ డమే పరిపాటిగా మారుతోంది. దీంతో ప్లాట్లు కొన్నవారు భవిష్య త్తులో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. చివరకు ప్రభుత్వం భ రించి వాటిని పరిష్క రించే వరకు వారు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మండలంలోని కదిరి - రాయచోటి రోడ్డులో భూముల ధరలకు రెక్కలు రావడంతో రియల్టర్లు డేగలా వాలిపోయారు. తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేస్తున్నారు. ఆ తరువాత ప్రభుత్వ భూములు, చెరువులు, కొండలు, గుట్టలు నుంచి మట్టిని తరలించి వాటిని చదును చేసి ప్లాట్లు వేస్తున్నారు. అయితే రెవెన్యూ, పంచాయతీ, ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఆ ప్లాట్ల క్రయవిక్రయాలు జరుపుతున్నారు. వీటిపై అధికారులు పట్టించుకోకపోవడంతో రియల్టర్లు మూడు పూలు ఆరు కాయల చందంగా వ్యాపారాలు సాగిస్తున్నారు.

వాగును పూడ్చి లేఅవుట్లు

కదిరి - రాయచోటి రోడ్డులోని రెక్కమాను వద్ద ప్రధాన రహదారిలో ఆర్‌ అండ్‌ బీ వారు కల్వర్టు నిర్మించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆ కల్వర్టు నుంచి చిన్న పైపును వేసి, వాగును పూడ్చివేసి భూమిని చదును చేశారు. ఇలా చాల దూరం వరకు చిన్నపాటి పైపులు భూ మిలో పాతి ఏకంగా ఆ కాలనీకి ప్రధాన రహదారి ఏర్పాటు చేశారు. అలాగే కురుమామిడి పంచాయతీ లోని పలు కొండల నుంచి వచ్చే వర్షపు నీరు


ఈ వాగు ద్వారా దనియానచెరువుకు వెళ్తుంది. వర్షాకాలంలో వర్షాలు అధికంగా కురిస్తే ఎగువప్రాంతం నుంచి వచ్చే నీరు ఆ చిన్న పైపుల నుంచి వెళ్లేందుకు వీలుపడదని పలువురు తెలుపుతున్నారు. దీంతో కల్వర్టు ఎగువ నిర్మించిన పలువురి ఇళ్లల్లోకి నీరు చేరే అవకాశం ఉందని, వర్ష్షాకాలంలో ప్రమాదాలు కూడా ముంచుకు రావచ్చని అంటున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు కూడా ఏమాత్రం పట్టించుకోవంలేదని కాలనీవాసులు తెలుపుతున్నారు.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం

- తహసీల్దార్‌, ఇరిగేషన జేఈ

కదిరి - రాయచోటి ప్రధాన రహదారిలోని రెక్కమాను వద్ద రియల్టర్లు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు అనుమ తులు తీసుకోలేదని తహసీల్దార్‌ బాబురావు తెలిపారు. లేఅవుట్లు వేసిన స్థలాన్ని పరిశీలించి చర్యలు చేపడతామన్నారు. ఇరిగేషన జేఈ అరుణ కుమారి మాట్లాడుతూ ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీరు వా గుల ద్వారానే చెరువులకు చేరుతాయని, వాటిని పూడ్డిచ, పైపులు అమ ర్చితే భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. లేఅవుట్‌ వేసిన స్థలాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 10 , 2026 | 11:09 PM