RTO: రోడ్డు భద్రత.. అందరి బాధ్యత : ఆర్టీవో
ABN , Publish Date - Jan 14 , 2026 | 12:11 AM
రోడ్డు భద్రత అందరి బాధ్యత అని ఆర్టీవో శ్రీనివాసులు పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా మంగళవారం స్థానిక కుటాగుల్ల వద్ద ఓబులేశ్వర డిఫెన్స అకాడమీలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
కదిరి అర్బన, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): రోడ్డు భద్రత అందరి బాధ్యత అని ఆర్టీవో శ్రీనివాసులు పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా మంగళవారం స్థానిక కుటాగుల్ల వద్ద ఓబులేశ్వర డిఫెన్స అకాడమీలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్టీవో మాట్లాడుతూ... రోడ్డు భద్రతా నియమాలను అనుసరిస్తూ వాహనాలు నడిపితే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. అందరూ ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకోవడంతో పాటు వాటిని పాటంచాలని పేర్కొన్నారు. వాహనం నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరిగా ఉండాలన్నారు. అనంతరం అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంవీఐ వరప్రసాద్, అకాడమీ ఇనచార్జ్ ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....