GOD: ఖాద్రీశుడి భక్తుల గిరి ప్రదక్షిణ
ABN , Publish Date - Jan 12 , 2026 | 11:36 PM
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతిని పురష్కరించుకుని సోమవారం మండల పరిధిలోని కుమ్మవాండ్ల పల్లిలో స్తోత్రాద్రి కొండ చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు.
కదిరి అర్బన, జనవరి 12(ఆంధ్రజ్యోతి): ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతిని పురష్కరించుకుని సోమవారం మండల పరిధిలోని కుమ్మవాండ్ల పల్లిలో స్తోత్రాద్రి కొండ చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. స్తోత్రాద్రిపై కొండల లక్ష్మీనరసింహుడిగా చెంచులక్ష్మీ సమేతంగా కొలువైన శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఖాద్రీ లక్ష్మీనరసింహ సేవా సమితి సభ్యులు భక్తులకు అల్పాహారం, మజ్జిగ అందించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....