Share News

PIPE LINE: పైపులైన లీకేజీలు ... ప్రజలకు ఇబ్బందులు

ABN , Publish Date - Jan 12 , 2026 | 12:01 AM

పట్టణంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి పైపులు లీకవుతున్నాయి. వాటి వల్ల కొన్నిచోట్ల నీరు కలుషిత మవుతోంది. మరికొన్ని చోట్ల లీకేజీ అయిన నీరు పారి రోడ్లు పా చిపట్టి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లీకుల్లో ఏర్పడిన గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రధాన రోడ్లలో సైతం తాగునీటి పైపులు లీక్‌ అవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు.

PIPE LINE: పైపులైన లీకేజీలు ... ప్రజలకు ఇబ్బందులు
Leaking pipes in Nizamwali Colony

పట్టించుకోని మున్సిపల్‌ అధికారులు

కదిరి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి పైపులు లీకవుతున్నాయి. వాటి వల్ల కొన్నిచోట్ల నీరు కలుషిత మవుతోంది. మరికొన్ని చోట్ల లీకేజీ అయిన నీరు పారి రోడ్లు పా చిపట్టి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లీకుల్లో ఏర్పడిన గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రధాన రోడ్లలో సైతం తాగునీటి పైపులు లీక్‌ అవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. ఈ లీకులకు మరమ్మతులు చేయడానికి మున్సిపాలిటీ వద్ద డబ్బు లు లేవంటూ మున్సిపల్‌ అధికారులు నెలలు, సంవత్సరాలు గడుపుతు న్నారు. దీంతో ప్రజలు కలుషిత నీరే తాగుతు న్నారు. కొన్నిచో ట్ల నీరు వృథా అవుతోంది. దీన్ని పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

కలుషితమవుతున్న నీరు

పట్టణంలో పలు చోట్ల పైపులైన లీక్‌ల వద్ద తాగు నీరు కలుషిత మవుతోంది. సైదాపురం ఆంజనేయస్వామి ఆల యానికి ఎదురుగా ఏడీ సీసీ బ్యాంక్‌ పక్కనే సంవ త్సరం నుంచి పైపు లీకేజీ అవుతోంది. ఇక్కడ పేరు కుపోయిన చెత్తచెదారం, మురుగునీరు ఇతర కలు షితాలు లీక్‌ ప్రాంతంలో పైపులోకి వెళ్తుం డడంతో తాగునీరంతా కలుషితమ వుతోంది. ఇదే పరిస్థితి అ డపాల వీధిలో ఉంది. తా గునీరు కలుషితమై వస్తుం డండంతో ఆ ప్రాంత వా సులు మున్సిపల్‌నీటిని తా గకుండా, ఇతర అవసరాల కు వినియోగిస్తున్నారు. వలీసాబ్‌ రోడ్డులో కాలువ పక్కనే లీకేజీ ఏర్పడి,నీరు కలుషితమవుతోంది. చాలాచోట్ల ఇదే పరిస్థితి. అధికారిక లెక్కల ప్రకారం పట్టణంలో 130చోట్లు లీక్‌లు ఏర్పడినట్లు గుర్తించారు.

పాచిపట్టిన రోడ్లు

మున్సిపాలిటీలోని నిజాంవలీ కాలనీలోని 14 వార్డులో తాగునీటి పైపుల నుంచి నీరు లీకేజీ అవుతోంది. దీంతో మమనీరు వదిలి సమ యంలో రోడ్డంతా నీరు పారుతూ నడవడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో రోడ్డు పాచిపట్టి వాహనాలు జారి పడిన సంఘటనలు అనేకమున్నాయి. చివరికి ఆటోలు సైతం ఆరోడ్డుపైన వెళ్లాలంటే భయపడుతున్న పరిస్థితి ఉందని స్థానికులు అంటున్నారు.


గుంతలతో ప్రమాదాలు

ప్రధాన రహదారిలో కొన్నిచోట్ల పైపుల లీకేజీ నీరు పారి గుంతల్లో నిలుస్తోంది. దీంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. టవర్‌క్లాక్‌ సమీపంలో పెద్దఎత్తున నీరు లీక్‌ అవడంతో రోడ్డుపై పెద్ద నీటి గుంత ఏర్పడింది. రోడ్డు మీద ఏర్పడిన ఆ గుంతలో నుంచి వెళ్లడానికి పెద్దవా హనాలకు కూడా ఇబ్బందిగా ఉంది. అయినా మున్సిపాలిటీవారు పట్టిం చుకోవడంలేదు. వడ్డె ఓబున్న విగ్రహం పక్కన లీక్‌ ఏర్పడితే రెండు నెలల తరువాత మరమ్మతులు చేశారు. అయితే ఆ గుంతలను అలాగే వదిలివేయడంతో వాహనాలు వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. అలాగే బాలికల పాఠశాల వద్ద తాగునీటి పైపులైనకు గేట్‌వాల్‌ ఉంది. అయితే నీటి లీకేజీకి అక్కడ గుంత ఏర్పడింది. దాన్ని మూసివేయకుండా అలాగే వదిలేశారు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రధాన రహదారిలోనే ఇలా ఉంటే శివారు ప్రాంతాల్లో, చిన్నకాలనీల సందులో పరిస్థితి ఏవిధంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు స్పందించి లీక్‌కలు మరమ్మతులు పూర్తి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

మరమ్మతుల సామగ్రికి టెండర్లు పిలిచాం- రెడ్డెమ్మ, మున్సిపల్‌ డీఈ

పట్టణంలో తాగునీటి పైపులైన్ల లీక్‌లు ఉన్నమాట వాస్తమమే. వాటి మరమ్మతులు చేపట్టడానికి సామగ్రి లేదు. సామగ్రి కోసం టెండర్లు పిలిచాం. టెండర్లు పూర్తి అయిన వెంటనే మరమ్మతులు చేస్తాం.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 12 , 2026 | 12:01 AM