TDP: రోడ్డు ఏర్పాటుకు పరిశీలన
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:20 PM
తలుపుల మండలపరిధిలోని నిగ్గిడి గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు ఏర్పాటుపై టీడీపీ నాయకులు శనివారం పరిశీలించారు. నిగ్గిడి కల్పించాని రోడ్డు నిర్మించాలని ఆ గ్రామస్థులు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌కు ఇటీవల విన్న వించారు.
కదిరి, జనవరి 10(ఆంధ్రజ్యోతి): తలుపుల మండలపరిధిలోని నిగ్గిడి గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు ఏర్పాటుపై టీడీపీ నాయకులు శనివారం పరిశీలించారు. నిగ్గిడి కల్పించాని రోడ్డు నిర్మించాలని ఆ గ్రామస్థులు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌కు ఇటీవల విన్న వించారు. అత్యవసర సమయాల్లో గర్భిణులు, రోగు లను ఆసుప్రతికి తీసుకెళ్లాలన్నా, రైతులు పండించిన పంటలు అమ్ముకోవాలన్నా, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే ఆదేశాల మేరకు టీడీపీ మండల కన్వీనర్ మేడా శంకర్ ఆధ్వర్యంలో మండల కమిటీ సభ్యులు నిగ్గిడి నుంచి అడవి గుండా పందల కుంట వరకు వెళ్లి పరిశీలించారు. టీడీపీ మండల కోకన్వీనర్ వీర భార్గవ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు ఓబులరెడ్డి, సర్పంచ దేవేంద్ర, నాయకులు గంగరాజు, లోకేష్, శ్రీశైలం రమణ, బండ్లపల్లి సాంబ, నిగ్గిడి గ్రామస్థులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....